అనుమతి లేకుండా మహిళ పాదాలు కూడా తాకకూడదు.. బాంబే హైకోర్టు!

2014లో జూలైలో మహారాష్ట్రలోని జాల్నా జిల్లా పర్టుర్ పట్టణానికి చెందిన మహిళ ఎదురింటి వ్యక్తి తన భర్త లేని సమయంలో అర్ధరాత్రివేళ ఇంట్లోకి వచ్చి తన పాదాలను తాకాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఆ నిందితుడు ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో ఆ మహిళ అలాగే తన నానమ్మ మాత్రమే ఉన్నట్లు తెలిపింది. ఆ రోజు సాయంత్రం నీ భర్త ఎప్పుడు వస్తాడు అని అడిగిన నిందితుడు అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఇంటిలోకి ప్రవేశించాడట. నిద్రలో ఉండగా తన పాదాలను తాకడంతో మెలుకువ వచ్చిందని, లేచి చూసే సరికి పక్కింటి వ్యక్తి కూర్చొని ఉన్నాడు అని ఆమె తెలిపింది.

ఇక ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా, ఆ సమయంలో ఇంట్లోకి వెళ్లింది తాను కాదు అంటూ ఆ నిందితుడు బుకాయించాడు. అంతేకాకుండా లోపలి నుంచి తలుపు గడియ పెట్టకపోవడంతో ఇంటి లోకి రావడానికి ఆమె అనుమతినిచ్చింది అంటూ వాదించాడు. అయితే తాను లైంగిక ఉద్దేశంతో ఆ మహిళ పాదాలను తాకలేదని, ఘటన జరిగిన 12 గంటల తర్వాత ఫిర్యాదు చేయడం ఏంటి అంటూ ఆ వ్యక్తి అభ్యంతరం తెలిపాడు.

ఇక ఇదే విషయంపై విచారణ జరిపిన జాల్నా సెషన్స్ కోర్ట్ నిండుతుడిని దోషిగా నిర్ధారించింది. అర్ధరాత్రి బాధితురాలు ఇంట్లోకి ప్రవేశించి, మహిళ పాదాలను తాకడం చూస్తుంటే లైంగిక ఉద్దేశంతో ఆ పని చేసినట్లు అర్థమవుతోంది అని పేర్కొంది. దీనితో సదరు వ్యక్తికి ఏడాదిపాటు జైలు శిక్షను విధించింది. మహిళా అనుమతి లేకుండా పాదాలే కాదు, శరీరంలో ఈ భాగాన్ని తాకిన గౌరవానికి భంగం కలిగినట్లు అని అభిప్రాయపడింది. ఈ విషయం పట్ల నిందితుడు బాంబే హైకోర్టులో సవాల్ చేయగా, దిగువ కోర్టు తీర్పును సమర్థించింది. ఈ సందర్భంగా 1996లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *