‘సర్కారువారి పాట’లో మెప్పించనున్న మహేశ్‌ గారాలపట్టి..!

మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘సర్కారువారి పాట’ . ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. మహేశ్ సరసన నాయికగా కీర్తి సురేశ్ అలరించనున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన ‘కళావతి’ సాంగ్ వ్యూస్ పరంగా .. లైక్స్ పరంగా కొత్త రికార్డులను సృష్టించింది. యూట్యూబ్‌లో ఈ పాట ఇప్ప‌టివ‌ర‌కు తొమ్మ‌దిన్న‌ర కోట్ల మంది వీక్షించారు. కాగా ఈ సినిమా నుంచి ఓ స్పెషల్‌ అప్‌డేట్‌ రిలీజ్‌ అయింది.

https://youtu.be/T30RoCkiovE

‘సర్కారువారి పాట’ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌గా ‘పెన్నీ’ సాంగ్‌ను ఈ నెల 20వ తేదీన రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సాంగ్ కి సంబంధించి ఒక ప్రోమోను వదిలారు. అయితే ఇక్కడ విషేశం ఏంటంటే.. మహేశ్‌ గారాలపట్టి సితార ఈ సినిమాతో తొలిసారి సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేయనున్నారు. ప్రతీ రూపాయిని అందరూ గౌరవించాలంటూ సాగే ‘పెన్నీ’ సాంగ్‌కు సితార డ్యాన్స్‌తో మెప్పించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోని శనివారం ఉదయం మహేశ్‌బాబు ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘‘తన పెర్ఫార్మెన్స్‌తో మరోసారి అందర్నీ అలరించనుంది’’ అని మహేశ్‌ పేర్కొన్నారు.

మొదటి నుంచి కూడా సితార డాన్సుల పట్ల ఆసక్తిని చూపుతూనే వచ్చింది. అందుకు సంబంధించిన వీడియోలను నమ్రత ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ వచ్చింది. అందువల్లనే సితార ఇప్పడూ చాలా ఈజ్ తో స్టెప్స్ అదరగొట్టేసింది. దాంతో ఫుల్ సాంగ్ కోసం అందరూ ఎదురుచూస్తూ కూర్చోవడం ఖాయం. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *