ప్రపంచంలోనే అతి పెద్ద కారు.. హెలిప్యాడ్, స్విమ్మింగ్ పూల్..
సాధారణంగా కారు అంటే నాలుగు చక్రాలు ఉంటాయి. మహా అంటే 12 అడుగులు పొడవు ఉంటుంది. కానీ ఓ కారు మాత్రం ఏకంగా 18.28 మీటర్ల పొడవు ఉంది. ప్రపంచం లోనే అత్యంత పొడవైన కారు ఇదే. దీనిని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో కూడా స్థానం కలిపించారు. ఇంతకీ ఇంత పొడవు ఉన్న కారుకు ఏవో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి కదా అని అనుకుంటున్నారా… అవును ఈ కారుకు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అత్యంత లగ్జరీగా ఉండేందుకు ఈ కారు కరెక్ట్ ఎంపిక అని అంటున్నారు కొందరు నిపుణులు. ఎందుకంటే ఈ కారులో స్విమ్మింగ్ పూల్ ఉంది.
కేవలం ఒక్క స్విమింగ్ పూల్ మాత్రమే కాదు. అత్యంత ఖరీదైన ఆటగా ఉంటే గోల్పు కోర్టు కూడా దీనిలో ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి మోడల కార్లు రాలేదు అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. దీనిలో ఉండే మరో ప్రత్యేక ఆకర్షణ ఏంటి అంటే ఈ కారు పైన హెలికాప్టర్ దిగవచ్చు. అందుకోసం ఏకంగా కారుపైన ఒక హెలిప్యాడ్ ను ఏర్పాటు చేశారు. ఇన్ని వసతులు ఉన్న ఈ కారుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యామాల్లో వైరల్ గా మారింది.
ఈ కారుకు ఉండే మరో ప్రత్యేకత ఏంటి అంటే ఈ కారును ఎటువైపు నుంచి అయినా డ్రైవ్ చేయవచ్చు. ఈ కారును తొలుతగా 1986లో తయారు చేసారని నిర్వహకులు చెప్తున్నారు. ఈ కారుకు సుమారు 26 చక్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనికి అత్యంత శక్తి వంతమైన రెండు వీ8 ఇంజన్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.