జగన్ కు కేసీఆర్, కేటీఆర్ దండం పెడుతున్నారు : ధూళిపాళ్ల నరేంద్ర
ఏపీలో తిష్ట వేసిన విద్యుత్ సమస్యలు చూసి కేసీఆర్, కేటీఆర్ రోజూ జగన్కుద దండం పెట్టుకుంటున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్కుా జగన్ రుణం ఇంకా తీరలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రం సర్వనాశనం అయితేనే రుణం తీరుతుందా? అని మండిపడ్డారు. ఏపీలో విద్యుత్ కోతలపై ఏపీఈఆర్సీ అదేశాలివ్వటం ఆశ్చర్యకరంగా ఉందని, థర్మల్ ప్లాంట్లు మూసివేయాలన్న జగన్ స్వార్థ నిర్ణయాలతో వ్యవస్థ కుప్పకూలిందని ఆరోపించారు. పరిశ్రమలు 50 శాతమే విద్యుత్ వినియోగించుకోవాలని ఉందని, రాష్ట్రంలోని పరిశ్రమలకు పవర్ హాలిడే విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉల్లంఘిస్తే జరిమానాలా పేరిట రూ.లక్షల జరిమానా విధిస్తున్నారని, బహిరంగ మార్కెట్లో విద్యుత్ దొరకట్లేదని చెబుతున్నారని తెలిపారు. యూనిట్కు రూ.20 పెట్టి కొందామన్న విద్యుత్ దొరకట్లేదని, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రావట్లేదని తెలిపారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, ఈ పాపానికి బాధ్యులు సీఎం జగన్ కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల రాష్ట్రం విద్యుత్ కోతలమయమైందని, దీర్ఘకాలిక బొగ్గు ఒప్పందాలు చేసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి అన్నారు.
రాష్ట్రంలో పేదలపై ఛార్జీల భారం మోపుతున్నారని, రహస్య ఒప్పందాలు చేసుకుని పెద్దలకు కట్టబెడుతున్నారని, టీడీపీ హయాంలో కరెంట్ కోతల్లేవు, ఒక్కసారి కూడా ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి స్వార్థపూరిత విధానాలే రాష్ట్రాన్ని అంధకారాంధ్రప్రదేశ్ గా మార్చాయన్నారు. రాష్ట్రంలో హైడల్..థర్మల్.. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి పుష్కలమైన వనరులున్నాకూడా విద్యుత్ రంగం ఎందుకు కుదేలైందని ప్రశ్నించారు. కరెంట్ కోతలు..ప్రజల అవస్థలు తెలియాలంటే మంత్రులంతా వారికుటుంబాలతో కలిసి పల్లెల్లో నిద్రచేయాలని సూచించారు.