వంగవీటి రంగా పేరుపెట్టాలి..రంగా విగ్రహం వద్ద భారీ బందోబస్తు

ఆంధ్రప్రదేశ్ లో నూతన జిల్లాలు ఏర్పాటు కాబోతోంది అందరికీ తెలిసిందే. ఈ జిల్లాల పునర్విభజనలో భాగంగా కృష్ణా జిల్లా రెండు జిల్లాలుగా రూపాంతరం చెందబోతోంది. ఇందులో తూర్పు ప్రాంతానికి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరు పెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.  ఉగాది నుంచి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రరెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

Kapu Leaders Demand Ranga Nane to Vijayawada

మరోవైపు విజయవాడ కేంద్రంగా ఏర్పాటు కాబోతున్న పశ్చిమకృష్ణాకు మాజీ ఎమ్మెల్యే, కాపునేత వంగవీటి రంగా పేరు పెట్టాలని ఆయా వర్గాల నుండి డిమాండ్ పెరుగుతోంది. ఇదే డిమాండ్ తో ఇటీవల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఒకరోజు పాటు నిరసన దీక్ష కూడా చేపట్టారు. ఇదే డిమాండ్ లో భాగంగా విజయవాడలోని రాఘవయ్య పార్కు వద్దనున్న రంగా విగ్రహానికి నివాళి అర్పించే కార్యక్రమానికి కాపు సంఘాలు పిలుపునిచ్చాయి.

రంగా విగ్రహానికి వాళి అర్పించిన అనంతరం… జిల్లాకు రంగా పేరు పెట్టాలనే డిమాండ్ తో కూడిన వినతిపత్రాన్ని సబ్ కలెక్టర్ కు ఇవ్వాలని నిర్ణయించాయి. అయితే కోవిడ్ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అనుమతిని ఇవ్వలేమని పోలీసులు తెలిపారు. పరిమిత సంఖ్యలో వస్తేనే అనుమతిస్తామని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో రంగా విగ్రహం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలైన మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీతో వంగవీటి రాధా అత్యంత సన్నిహితంగా ఉంటారన్న విషయం తెలిసిందే. తనండ్రి పేరు పెట్టాలన్న అంశాన్ని సన్నిహిత వైసీపీ నేతల వద్ద ప్రస్తావించారో స్పష్టం కాలేదు. ఈ నేపథ్యంలో నేడు కాపు సంఘాల పోరాటానికి వంగవీటి రాధా స్పందిస్తారా లేదా అన్న మీమాంస ఏర్పడింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *