విశాఖ ఉక్కు పరిరక్షణకై జనసేన డిజిటల్ క్యాంపెయిన్.. మరి స్పందన లభిస్తుందా?

విశాఖ స్టీల్ ప్లాంట్​ పరిరక్షణ కోసం జనసేన మరోముందడుగు వేసింది. ఈ నెల 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు డిటిటల్ క్యాంపెయిన్​ పేరుతో సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణణను వ్యతిరేకిస్తూ పార్లమెంటులో పోరాటం చేయాని వైకాపా, టీడీపీ ఎంపీలను ట్విట్టర్​లో ట్యాగ్ చేయాలని ప్రజలను కోరుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని ఎంపీలకు గుర్తుచేయాల్సిన బాధ్యత మనదేనని అన్నారు. ఈ ఉద్యమంలో భాగంగా ఎంపీలు కూడా ఫ్లకార్డులు పట్టుకుని పార్లమెంటులో స్టీల్​ప్లాంట్​ పరిరక్షణకు డిమాండ్ చేయాలని అన్నారు.

ఇంకా మున్ముందు ఈ ఉద్యమాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తామని అన్నారు పవన్​. ఉక్కు కార్మికులు, వారి కుటుంబాలకు తాము అండగా నిలుస్తామని అన్నారు. ఈ ఉద్యమం రాజకీయాలకు అతీతంగా చేస్తున్నదని.. ఇందులో ఎటువంటి స్వార్థబుద్ది లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే #raise_placards_andhra_mpఅనే హ్యాష్ ట్యాగ్​ను ఉపయోగించాలని ప్రజలకు సూచించారు పవన్​. దీన్ని లోక్​సభ, రాజ్య సభ సభ్యులకు ట్యాగ్​ చేయాలని కోరారు.

మరి ప్రజల్లో ఈ ఉద్యమానికి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాల్సి ఉంది. ఈ ఉద్యమంపై పలువురు రాజకీయ నాయకులు స్పందిస్తూ.. దీనిపై వచ్చే లాభమేంటో అసలు ఎవరికీ అర్థం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై ప్రత్యక్ష పోరాటాలు కానీ, పరస్పర సంప్రదితులతోనే  సమస్య తీరుతుంది.. ఇలాంటి డిజిటల్ ఉద్యమాలు చేయడం చాలా విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు.  ప్రస్తుతం బీజేపీకి సన్నిహింతా ఉంటున్న పవన్ కేంద్రంలో తనకున్న పలుకుబడిని ఎందుకుఉపయోగించలేకపోతున్నాడన్ని మరికొందరి ప్రశ్న. ఈ క్రమంలోనే ఇటీవలే మంగళగిరిలో చేసిన దీక్షతో పవన్ సాధించేందేదీ లేదని.. ఇప్పుడు ఈ క్యాంపెయిన్​తో ఏం చేస్తారో తెలియడం లేదంటూ విమర్శలు చేశారు. మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *