ఆ విషయాన్ని జగన్ సీరియస్ గా తీసుకున్నారు : మంత్రి రజనీ

రేప‌ల్లె రైల్వే స్టేష‌న్‌లో మ‌హిళ‌పై అత్యాచార ఘ‌ట‌న అత్యంత బాధాక‌రమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జినీ అన్నారు. ఈ విష‌యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సీరియ‌స్‌గా తీసుకున్నారని పేర్కొన్నారు. నిందితుల‌కు క‌ఠిన శిక్ష ప‌డే వ‌ర‌కు తమ ప్రభుత్వం వ‌దిలిపెట్టదని పేర్కొన్నారు. పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. జిల్లా ఎస్పీతో, ఆస్పత్రి అధికారుల‌తో మాట్లాడామన్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చూడాల‌ని రేప‌ల్లె ఆస్పత్రి అధికారుల‌ను ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు వైద్య సిబ్బంది ప‌ర్యవేక్షణ‌లో ఉన్నారని చెప్పారు.  ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందన్నారు.

బాధితురాలికి, ఆమె కుటుంబానికి మా ప్రభుత్వం అన్ని విధాలా అండ‌గా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధితురాలిని సాయంత్రం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరామర్శించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు. అయితే ఇదే సమయంలో మంత్రి రజనీ అక్కడికి చేరుకోవడంతో ఆమెను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రయత్నించారు.

దీంతో కాసేపు తోపులాట చేసుకుంది. ఇక ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన ఓ ఎస్సీ కుటుంబం కూలీ  పనుల కోసం రేపల్లె వచ్చారు. పనులు ముగించుకుని సొంతూరు వెళ్లాలనుకుని స్టేషన్ కు వచ్చారు. ఒంటరిగా ఉన్న వారిపై దాడి చేసి, భర్తను బెదిరించి రైల్వే స్టేషన్ లోనే మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెల్లినా తలుపులు తీయలేదని మహిళ భర్త ఆరోపించారు. అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు గంజాయి మత్తుకు అలవాటు పడ్డట్లు తెలుస్తోంది.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *