గుడివాడలో ఇద్దరు వైసీపీ నేతల మరణాలకు మంత్రే కారణం? : వర్ల రామయ్య

గుడివాడకు చెందిన ఇద్దరు వైసీపీ నేతలైన వంకా విజయ్, అడపా బాబ్జీ మరణాలకు మంత్రి కొడాలి నానికి ఉన్న సంబంధమేంటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రశ్నించారు. అడపాబాబ్జీ శవయాత్రలో మంత్రిని అడ్డగించి చొక్కాపట్టుకొని ఓ యువకుడు బాబ్జీచావుకు మంత్రే కారణమని నిలదీసింది నిజమా..కాదా? అని ప్రశ్నించారు.  2014 ఎన్నికలప్రచార సమయంలో వంకావి జయ్ మంత్రి కోసం ఖర్చుపెట్టినడబ్బంతా తిరిగిస్తానని మంత్రి ఒప్పుకున్నది నిజమా..కాదా? అని అన్నారు. 2015లో వంకా విజయ్ ఎందుకు రైలు కింద పడి ఆత్మహత్యచేసుకున్నాడు, ఆ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందని రైల్వేపోలీసులను మభ్యపెట్టింది కొడాలినానీయేనా? అని అనుమానం వ్యక్తం చేశారు.

‘‘వంకా విజయ్ మరణించినప్పుడు అతనిజేబులోని సూసైడ్ నోట్ ఏమైంది..? ఆనోట్ తాలూకా రెండో కాపీ అతని బావ  అడపాబాబ్జీకి చేరింది నిజంకాదా? దానిగురించి మంత్రికి తెలిసి..  విజయ్ సూసైడ్ నోట్ బయట పెట్టవద్దని, అతను తనకోసం ఖర్చుపెట్టిన డబ్బంతా తిరిగిస్తానని, పార్టీలో కీలక స్థానం కట్టబెడతానని బాబ్జీకి మంత్రి హామీ ఇచ్చింది నిజమా? కాదా.? బాబ్జీని కూడా పట్టించుకోకుండా..మంత్రి అతనికి ముఖంచాటేయబట్టే… అతను తీవ్ర ఒత్తిడికిలోనై గుండెపోటుకు గురై చనిపోయింది నిజం కాదా?  గుడివాడ ప్రజలు వంకావిజయ్, అడపాబాబ్జీ మరణాలకు ఎవరు కారణమని చెప్పుకుంటున్నారు.

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి, డీజీపీకిఉందా..లేదా? గుడివాడ నియోజకవర్గంలో వేళ్లూనుకున్న మంత్రి ఆగడాలపై, ఆయన అధికారదర్పానికి, నోటికి భయపడి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న మంత్రి బాధితుల గోడుపై  సమగగ్రమైన దర్యాప్తుజరిపించాలని డీజీపీకి లేఖ రాస్తున్నాం. గుడివాడకు చట్టాలు వర్తించవా.? గుడివాడిని యోజకవర్గం ఏమైనా మంత్రి కొడాలినానీ సొంత జాగీరా? గుడివాడ నియోజకవర్గానికి రాష్ట్రంలో, దేశంలో ఏమైనా ప్రత్యేక ప్రతిపత్తి ఉందా? కొడాలినానీ చెప్పిందే ఆ నియోజకవర్గంలో వేదమా..అక్కడేమీ పోలీస్, రెవెన్యూ, ఇతరశాఖలు ఏమీ లేవా’’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *