సమ్మర్ కదా..తాటి ముంజలు తినండి..ఎందుకంటే..?

సమ్మర్ లో మాత్రమే దొరికే కూలింగ్ పండ్లలో తాటిముంజలు(తాటినుంజలు) కూడా ఒకటి. తాటి ముంజల్లో వుండే కొబ్బరి నీళ్ళ లాంటి తియ్యటి నీళ్ళు మీదపడకుండా తినటం ఒక సరదా…వేసవిలో ప్రత్యేకంగా లభించే తాటిముంజలు, పుచ్చకాయలు బానుడి తాపన్ని తట్టుకునేందుకు ప్రజలు అత్యంత ప్రియంగా విటిని తింటారు. అదేవిధంగా శీతాల పానియాలపై కూడా ఎక్కువ మోజు చూపుతారు.అందులో భాగంగానే వేసవి కాలంలో వచ్చే తాటిముంజలకు బలే గిరాకి పెరిగింది.  తాటి ముంజను తొలవగానే మధ్యలో కొంత నీరు ఉంటుంది. ఆ నీరు మాత్రం నోరూరించే రుచిగా ఉంటుంది. వేసవిలో ఎండ నుంచి ఉపశమనం ఉపయోగపడుతాయి మనిషి శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ బాగా జరుగుతుంది.

శరీరానికి మంచి చల్లదనాన్ని అందిస్తుంది. ఎండాకాలం ఈ తాటి ముంజల్లో నీళ్లు చాలా చలువ చేస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకి ముసలి వాళ్లకి చాలా మంచిది. వీటిలో అధికంగా తేమ, తక్కువ కొవ్వు పదార్థాలు కలిగి చిన్నారులకు, హుద్రోగులకు, షుగర్ వ్యాధి గ్రస్తులకు, స్థూల కాయులకు ఎంతాగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి దోహదం చేయడంతో పాటు దాహార్తికి కూడా మంచి విరుగుడు. ఈ కాలంలో విరివిగా లభించే తాటి ముంజలు వల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదు. దాహార్తిని తగ్గించి శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాదు..అందానికీ ఎంతో మేలుచేస్తాయివి. కాలిన గాయాలకు, మచ్చలు, దద్దుర్లు వంటి సమస్యల్ని నివారించడానికి తాటిముంజల్లోని నీరు దివ్వౌషధంలా పనిచేస్తాయి.

వీటిని తరచూ తినడమే కాదు పూత రూపంలోనూ వేసుకోవచ్చు. లేత తాటిముంజుల్ని తీసుకుని గుజ్జులా చేసి అందులో కొద్దిగా పాలపొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా రాసుకుని కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. వేసవిలో మీరు బరువు తగ్గాలనుకుంటే, కొన్ని పౌండ్ల బరువు తగ్గించుకోవడానికి ఉత్తమ మార్గం తాటిముంజలు . వీటిలో ఉండే అధిక నీటిశాతం, మీ పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగించి ఆకలి కానివ్వవు. దాంతో చాలా తేలికగా బరువు తగ్గవచ్చు. వికారం, వాంతులు వచ్చినట్లు అనిపిస్తుంటే, ఐస్ యాపిల్ ఒక గ్రేట్ ట్రిక్. తాటి ముంజలు తినడం వల్ల ఆ ఫీలింగ్ తగ్గుతుంది.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *