పదేళ్లు తరువాత బయటపడిన ఐఫోన్​… ఎక్కడ ఉందంటే?

మనలో చాలా మందికి మతిమరుపు ఉంటుంది. ఒక వస్తువు ఎక్కడ పెట్టాం అనేది కొంతసేపటి తరువాత గుర్తు ఉండదు. రోజు ఒక వస్తువును ఎక్కడైన పెట్టడం ప్రారంభిస్తే.. అది అక్కడ పెడితేనే మరలా తీసుకోగలుగుతాం. పొరపాటున వేరే ప్రాంతంలో పెడితే మాత్రం ఇంక అంతే సంగతులు. దానికి కోసం ఎంత వెతికినా సరే మనకు ఉపయోగం ఉండదు. ఇలానే ఓ మహిళ తన ఐఫోన్​ ను ఎక్కడో పెట్టి మర్చిపోయింది. ఎంత వెతికినా సరే అది కనిపించలేదు. ఇంక అది దొరకదు అనే ఆలోచనతో… ఇంకో కొత్త ఫోన్ ను కొని వాడుకో సాగింది. ఈ క్రమంలోనే ముందున్న ఆ ఫోన్​ గురించి ఆలోచించడం మానేసింది. ఇలా సుమారు పదేళ్లు గడిచాయి.

iPhone found inside toilet in a fairly good shape 10 years after it was lost
iPhone found inside toilet in a fairly good shape 10 years after it was lost

సుమారు పదేళ్ల తరువాత ఆ ఫోన్​ ఒక్కసారిగా బయటపడింది. దానిని చూసిన వారు ఒక్క సారిగా షాక్​ అయ్యారు. ఇంతకీ ఆ ఫోన్ ఎక్కడ ఉన్నది అనేది ప్రస్తుతం సామాజిక మధ్యామాల్లో వైరల్ గా మారింది. ఆ ఫోన్ వారి ఇంట్లో ఉండే వాష్​ రూంలోని లావెట్రీ ఫ్లష్​ లో ఉందంట. ఇది తన భర్త చూసి తనకు చెప్పారు. అది తెలుకున్న ఆమె అది నిజంగా తన ఫోన్ నా లేక ఎవరిది అయినానా అని తెలుసుకుంటే తను పదేళ్ల కిందట వాడిని ఫోన్​ అని నిర్ధరణ చేసుకుంది.

ఇదిలా ఉంటే ఆ ఫోన్ వాష్​ రూంలోకి ఎలా వెళ్లింది. అందులోనూ టాయిలెట్ ఫ్లష్ లోకి ఎలా వచ్చింది. దానికి గల కారణం ఏంటీ అనేది ఇంకా తెలియలేదు. కానీ ఆమె చెప్తున్న దాని ప్రకారం తన ఎక్కడో పెట్టి మర్చిపోయాను అని అంటుంది. అనంతరం అది కనిపించలేదని చెప్పింది. నిజంగా టాయిలెట్​ ఫ్లష్​ లోకి ఎలా వెళ్లింది అనేది తనకు తెలయదు అని పేర్కొంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు చాలా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *