కీరదోసకాయను చూస్తే పిల్లులు పారిపోతాయట.. ఎందుకో తెలుసా?
Cat And Cocumber: మనుషులు ఉండే ఇళ్ళను పట్టుకొని తిరిగే పిల్లులు.. అడవిలో ఉండే పులిని పోలి ఉంటాయని మనకు తెలుసు. కానీ వీటికి పులికి ఉన్నంత పౌరుషం ఏమాత్రం ఉండదు. అందుకే ఇవి కుక్కని చూస్తే సచ్చేంత పని అయ్యింది అన్నట్టు అక్కడ్నుంచి పారిపోతాయి. మరి ఈ పిల్లులు కుక్కలకే కాకుండా కీరదోసకాయలో కూడా భయపడతాయని తెలుస్తుంది. అది ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పిల్లుల వింత ప్రవర్తన పై కొంతమంది పరిశోధకులు కొన్ని పరిశోధనలు చేయగా ఒక కొత్త విషయం బయటపడింది. అదేమిటంటే.. పిల్లులు తమ వెనకాల అప్పటివరకూ లేని కీరదోసకాయను సడన్ గా చూసి ఒక్కసారిగా భయపడతాయట. ఆ టైంలో వాటికి టెన్షన్ వేరే స్థాయిలో ఉండటంతో.. బాగా భయపడి ఒక్కసారిగా ఓ గెంతు గెంతి అక్కడినుంచి మాయమవుతాయని తెలిసింది.
కీర దోసకాయని అసలు పిల్లులు చూసి అంతలా ఎందుకు భయపడుతున్నాయి అంటే.. ఆహారం తినడానికి వచ్చినప్పుడు. వాటికి ఎదురుగా మీరు కీరదోసకాయ పెడితే అవి పారిపోవని.. కానీ మీరు వాటికి తెలియకుండా వెనకాల పెడితే.. అవి వెంటనే భయపడి పారిపోతాయని తెలిసింది. సడన్ గా తమ వెనకాల ఏదో పొడవుగా ఉన్నట్లు భావించిన పిల్లులు వెంటనే అది పాము అయి ఉండొచ్చని భయపడతాయట.
అందుకనే పిల్లి కూడా ఆహారం తినడానికి వచ్చే ముందు చుట్టుపక్కల అన్నీ పరిశీలిస్తుంది. దానికి ప్రమాదకరంగా అక్కడ ఏమీ లేదు.. అని అనిపించినప్పుడే అవి ఆహారం తినడానికి మొగ్గు చూపుతాయి. అందుకే పిల్లుల వెనకాల కీరదోసకాయ పెడితే లేని పామును ఊహించుకొని భయపడతాయి.