ఈ హెల్త్ డ్రింక్స్ తాగితే.. సీజనల్ ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు!
ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా కొందరు హడావిడిగా ఉండటంతో సరైన భోజనం చేయలేకపోతున్నారు. ఇలా ఆ సమయంలో ఆహారం తీసుకోవడం కుదరనప్పుడు మీ శరీరం ఫిట్ గా ఉండి రోజంతా శక్తితో పనిచేయాలంటే మీరు కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాళ్ల ఉప్పు, తేనెను అల్లం పొడితో కలిపి తాగండి. ఇలా తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈ వస్తువుల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీబ్యాక్టీరియల్, యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మన జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి. అంతేకాకుండా ఉబకాయం, పీరియడ్స్ నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడానికి ఇది బాగా పనిచేస్తుంది.
ఇక వేసవి కాలంలో అల్లం తినడం అంతగా మంచిది కాదు. కాబట్టి వేసవి కాలంలో అల్లం తినడం మానుకోవాలి. ఇక దాల్చిన చెక్క, తేనే ఒక గ్లాసు నీటిలో కలిపి తాగితే రోగనిరోధక శక్తి మరింత బలపడుతుంది. అంతేకాకుండా ఈ దాల్చిన చెక్క బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది.
కొత్తిమీరను ఒక రోజు ముందు నానబెట్టి తీసుకోవడం వలన కడుపు సంబంధిత సమస్యలకు ఇది చాలా మేలు చేస్తుంది. ఇది పేగును ఆరోగ్యంగా ఉంచడంలో మరింత సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో కూడా బాగా సహాయపడుతుంది.
జీలకర్ర పొట్టకు సంబంధించిన వ్యాధులను మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది. అంతేకాక ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా కలిగి ఉంటుంది.