నేను ఉద్యమం చేసింది పేద పిల్లల కోసమే : కాపునేత ముద్రగడ పద్మనాభం
పేద పిల్లల కోసమే కాపు ఉద్యమం చేశానని, కోటీశ్వరుడిని అపర కుబేరుడిని చేయడం కోసం కాదని అన్నారు. రాధాకృష్ణ ఆలోచనలను అమలు చేయడానికి అసమర్థుడిని.. చేతకానివాణ్ణి కాదని అన్నారు. ఈ మేరకు ముద్రగడ పద్మనాభం బుధవారం ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు లేఖ రాశారు. రాధాకృష్ణలా ఏకవచనంతో మాట్లాడే పత్రిక యజమానిని ఇంతవరకు చూడలేదన్నారు. ఆంధ్రజ్యోతి యజమాని కెఎల్ఎన్ ప్రసాద్ ను కుర్చీలోంచి కాళ్లు పట్టుకుని లాగి ఆ కుర్చీలో కూర్చున్న ఘనత రాధాకృష్ణది అని చురకలు అంటించారు. రాధాకృష్ణ చరిత్ర అందరూ చదవాలన్నారు. మీలా అపర కోటీశ్వరులు అవ్వలేదన్నారు.
నోట్ల రద్దు సమయంలో నేలమాళిగలో దాచిన నల్లధనాన్ని బంగారు షాపుల యజమానులను బెదిరించి ఎలా చెలామణిలోకి తెచ్చారో చెప్పాలన్నారు. రెండు తలలు కలిసి పుట్టిన పిల్లలను విడదీయడానికి ఎలా డబ్బు సంపాదించాలో తెలిపే విధానాన్ని రాధాకృష్ణ ప్రజలకు చెప్పాలని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెట్టింగ్ లను ప్రోత్సహించి ఎలా కోట్లు సంపాదించారో కూడా రాధాకృష్ణ సమాధానం చెప్పాలన్నారు.
రాధాకృష్ణ చెప్పినట్లు తాను నడుచుకుంటే లక్షల మంది పేదవారిని వదిలేసి ఒకరికో, ఇద్దరికో సహాయం చేయడం కోసం ఉద్యమం చేయడం న్యాయమంటారా అని ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి పత్రికలో రాధాకృష్ణ స్టింగర్ గానో, రిపోర్టర్ గానే చేసినట్లు గుర్తుందని, డొక్కు సైకిల్, డొక్కు స్కూటర్ మీద తిరేగేవారిని అన్నారు. ఈ రోజు మీ పరిస్థితి…………అంటూ పేర్కొన్నారు. అలాంటి మీరు ఆసంస్థ యజమాని కుర్చీలోంచి కాళ్లుపట్టుకుని లాగి కుర్చీలో కూర్చొన్న ఘనత తమరిదని, అటువంటి ఘన చరిత్ర ఏ కుల నాయకులకు ఉందని ప్రశ్నించారు.