మనవళ్ళతో తాత అనిపించుకోవడం నాకు నచ్చదు అంటూ.. బాలకృష్ణ!

Balakrishna: టాలీవుడ్ ప్రేక్షకులకు నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తన ప్రత్యేక మేనరిజంతో యువతను సైతం ఓ రేంజిలో ఆకట్టుకొని టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక ఇటీవల వచ్చిన అఖండ తో బాలయ్య కు వచ్చిన ఫేమ్ అంతా ఇంతా కాదు.

Balakrishna
Balakrishna

ఇదిలా ఉంటే తాజాగా ఆహా యాజమాన్యం బాలకృష్ణ ను కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగింది. ఈ ప్రశ్నలకు బాలయ్య తమదైన శైలిలో ఎక్కడా తగ్గకుండా సమాధానం ఇచ్చాడు. ఇక ఆహా యాజమాన్యం ఎప్పుడైనా కాలేజ్ బంక్ కొట్టారా అని అడగగా? ‘ కాలేజ్ బంక్ కొట్టకుండా ఎవరైనా ఉంటారా’ అని సరదాగా సమాధానమిచ్చాడు.

ఆ తర్వాత మరో ప్రశ్న ‘ సైట్ గా పబ్లిక్ లోకి వెళ్లి ఏమైనా ఏమైనా చెయ్యాలి అనుకుంటే ఆలోచించకుండా వెళ్ళిపోతారా? అని అడగగానే.. తనలాగా పబ్లిక్ తో కలిసిపోయే హీరో ఎవరూ లేరని తెలిపాడు. అంతేకాకుండా తన మనవళ్ల తో తాత అని పిలిపించుకోవడం నాకు నచ్చదు అని వాళ్ళు ఎప్పుడు నన్ను ‘బాల’ అని పిలవాలనే తెలిపాడు.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ‘అన్ స్టాపబుల్’ షో లో ఒక రేంజ్ లో హడావిడి చేస్తున్నాడు. ప్రేక్షకుల్లో కూడా ఈ షో మంచి రెస్పాన్సే పొందింది. ప్రతి ఒక్క ఎపిసోడ్ ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటూ ప్రస్తుతం ట్రేండింగ్ గా మారింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *