నేను హింసావాదిని..అధిష్టానానికి నేనేంటో చూపిస్తా : వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు

మంత్రి పదవులు దక్కని వైసీపీ నేతలు అసమ్మతితో ఇంకా రగిలిపోతున్నారు. ఇటీవల పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు అసమ్మతి గళం వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అంతటితో ఆగలేదు. మళ్లీ వైసీపీ అధిష్టానంపై విమర్శనాస్త్రాలు సంధించారు.  పాయకరావుపేట నియోజకవర్గం, కోటవురట్ల మండలంలో గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమంలో సోమవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే బాబురావు స్పందించారు. ఒక మాట కోసం తాను వైసీపీలో చేరానని.. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత హింసావాదంతో ఆ పార్టీలో చేరినట్ల తెలిపారు.

పార్టీ కోసం తాను ఎన్నో త్యాగాలు చేశానని.. అయితే తనను అమాయకుడిగా భావించి మంత్రి పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అమాయకుడిని కాదని.. అవకాశం వచ్చినప్పుడు తానేంటో చూపిస్తానని అన్నారు. మంత్రి పదవి రాకుండా అధిష్టానం దెబ్బకొట్టిందని.. తాను కూడా దెబ్బ కొట్టి చూపిస్తానని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంతక ముందు వాలంటీర్ల సన్మాన సభలో మాట్లాడారు.

ప్రభుత్వం ప్రశపెట్టే ప్రతి సంక్షేమ పథకం లబ్ధిదారులకు చేరాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ అంటే జనాలకు సేవ చేసే ఒక సైన్యం లాంటిదని అన్నారు. ముఖ్యమంత్రి ఆశయం నెరవేరాలంటే వాలంటరీ వ్యవస్థ మీద ఆధారపడి ఉందన్నారు. అయితే బాబూరావు వ్యాఖ్యలపై వైసీపీలోని వ్యతిరేక వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పదవుల కేటాయింపుల్లో సీం సామాజిక సమీకరణాలు చూసి ఇచ్చారని, అధిష్టానంపై బాబూరావు విమర్శలు సరికావని తెలిపారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *