బంకమట్టితో తయారుచేసిన నిజమైన బుగాటి కారు అసలు ఎలా తయారు చేసారంటే..!
Bugatti Car: మారుతున్న జీవన విధానం కారణంగా ప్రజలు అనేక విధాలుగా అప్డేట్ అయ్యారు. తమ సొంత ప్రతిభను గ్రహించుకొని వాళ్లకు కావాల్సిన వాహనాలను వాళ్ళే స్వయంగా తయారు చేసుకుని నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నారు. ఇక ఇదే క్రమంలో ముగ్గురు కుర్రాళ్ళు బంకమట్టితో బుగాటి కారు తయారు చేసి నెటిజన్ల ముందుకు వచ్చారు.
ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. ఒక ముగ్గురు కుర్రాళ్ళు సొంతంగా కారు తయారు చేసుకోవాలి అనుకున్నారు. వాళ్ల ప్లాన్ కూడా మామూలుగా లేదు బుగాటి కంపెనీకి చెందిన చిరాన్ కారు తీరు తయారు చేసుకోవాలని ప్లాన్ చేశారు. అది కూడా ఒట్టి ప్లాస్టిక్ ఇంకా మట్టితో తయారు చేయాలి అనుకున్నారు.
ఇక ఆ ముగ్గురు వారు తయారు చేయాలనుకున్న కారు మొదట ప్లాస్టిక్ పేపర్ సెట్ రూపంలో తయారు చేసుకున్నారు. ఆ తర్వాత చెరువు దగ్గరకు వెళ్లి కారు తయారీ చేయడానికి కావాల్సిన బంకమట్టిని కలెక్ట్ చేసుకున్నారు. ఇక అంతే కాకుండా ఆ కారుకు కావాల్సిన ఒక పాత ఇంజన్ కూడా సెట్ చేసుకున్నారు.
ఆ తర్వాత ఆ ముగ్గురు వాళ్ళ మైండ్ కు కొంత వాళ్ల చేతులకు మరింత పని పెట్టుకున్నారు. అంతే అద్భుతమైన బుగాటి చిరాన్ కారు రెడీ అయ్యింది. ఇక దాంట్లో ఎక్కి ఆ ముగ్గురు పల్లెటూరు లో హడావిడి చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ లో పంచుకున్నారు. ఇక మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు ఓ లుక్కేయండి.