రోజుకు ఎన్ని కోడిగుడ్లు తినాలి.. గుడ్లు వల్ల ఉపయోగాలు.. నష్టాలు ఏమిటో తెలుసా?
సాధారణంగా గుడ్డులో ఎన్నో పోషక విలువలు దాగి ఉంటాయి. అందుకే ప్రతి రోజూ ఒక గుడ్డు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు. గుడ్డులో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. కనుక ప్రతిరోజు గుడ్డు తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యల బారినపడకుండా ఎంతో ఆరోగ్యవంతంగా ఉండగలం అనే విషయం అందరికీ తెలిసిందే. అయితేఅధిక పోషకాలు కలిగాయని గుడ్లను అధికమొత్తంలో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
గుడ్డు పచ్చసొనలో అధికమొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుంది ఇందులో 200 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది కనుక మన శరీరానికి రోజుకు 300 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ అవసరం అవుతుంది. గుడ్డును తినడం వల్ల ఎలాంటి అనారోగ్యం ఉండదు. కాకపోతే గుడ్లను అధికమొత్తంలో తినడం వల్ల పేగు కదలికలు మందగిస్తాయి. అలాగే జీర్ణక్రియ వ్యవస్థ దెబ్బతింటుంది. వాంతులు కడుపు ఉబ్బరం వంటివి కూడా జరుగుతాయి. అయితే రోజుకి ఎన్ని గుడ్లు తినాలి అనే విషయం గురించి తెలియనప్పటికీ వారానికి ఏడు గుడ్లు తినాలి.
ఒక వ్యక్తి ఎంతో ఆరోగ్యవంతంగా ఉండి అతనికి ఏ విధమైనటువంటి ఇతర అనారోగ్య సమస్యలు లేకపోతే మూడు గుడ్లు వరకు తినవచ్చునని నిపుణులు వెల్లడించారు. గుడ్డుకు వేడి చేసే గుణం ఉంటుంది కనుక వేసవికాలంలో వీలైనంత వరకు గుడ్లు తినడం తగ్గించడం ఎంతో ఉత్తమం. ముఖ్యంగా చిన్న పిల్లలకు వేసవికాలంలో గుడ్డు తక్కువగా పెట్టడం వల్ల శరీరం వేడి కలగకుండా ఉంటుంది.