బియ్యంతో చర్మ సౌందర్యాన్ని పెంచుకోండిలా!

నిత్యం మన వంటింట్లో ఉండే బియ్యంతో అందని మరింత రెట్టింపు చేసుకోవచ్చు.ఈ చిన్న చిట్కాలతో ఇంట్లోనే ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి. బియ్యపు పిండి చర్మాన్ని ప్రకాశవంతం చేయడంతో పాటు మొటిమలు, పిగ్మెంటేషన్ మచ్చలను తొలగిస్తుంది. ఇదులో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది ఇది కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మార్కెట్ లో బియ్యం పిండి ఫేస్-ప్యాక్‌ల అందుబాటులో ఉన్నాయి.అయితే ఎటువంటి ఖర్చు లేకుండా మన ఇంట్లో దొరికే బియ్యంతో ఫేస్ మాస్క్ ని ఎలా తయారు చేసుకోవచ్చు అలానే దాని ప్రయోజనాలు కూడా తెలుసుకోండి మరి.

how-gain-beautifull-skin-with-rice

బియ్యప్పిండి, పచ్చి పాలు, తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం స్నానం చేయడానికి ముందు అప్లై చేయండి.ఇలా చేయడం వలన చర్మకాంతి తిరిగి రావడంతో పాటు నల్ల మచ్చలు తొలగిపోతాయి.చాలా మందికి దద్దుర్లు లేదా గాయాలు వలన ఏర్పడిన మచ్చలు అలాగే ఉంటాయి.ఆ సమస్యను అధిగమించడానికి బియ్యప్పిండి, రెండు టీస్పూన్ల పసుపు పొడి , కొంచెం నిమ్మరసం కలపండి.

తర్వాత ఆ మిశ్రమాన్ని ఆ మచ్చలు దగ్గర అప్లై చేయండి.ఈ ప్యాక్‌ని వారానికి రెండు రోజులు చేయడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుంది.అలానే బియ్యప్పిండి, కాఫీ, ఓట్స్ పౌడర్, మిల్క్ పౌడర్, రోజ్ వాటర్ ఈ మిశ్రమం మొత్తాన్ని కలపాలి. జిడ్డు చర్మం ఉన్నవారు వారానికి కనీసం మూడు రోజులైనా ఫేస్ ప్యాక్ ల వేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ముఖం జిడ్డుగా కనిపించదు చర్మం మృదువుగా మారి అందంగా కాంతివంతంగా కనిపిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *