Working women: ఉద్యోగాలు చేసే మహిళలు ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతున్నారని తెలుసా… దాన్ని నివారించాలంటే !

పురుషులకు ఏ మాత్రం తగ్గకుండా మహిళలు కూడా వివిధ రంగాల్లో దూసుకుపోతున్నారు. అయితే మగవారితో పోల్చితే ఉద్యోగాలు చేసే ఆడవారే దీర్ఘకాలిక ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నట్టు పలు అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. కాగా పురుషులతో పాటే సమాన స్థాయిలో ఉండే మహిళలు కొన్ని కొన్ని సార్లు వెనకబడటం మనం చూస్తున్నదే. దీనికి కారణాలు అనేకం. ఒక వైపు కుటుంబ బాధ్యతలు, మరో వైపు వృత్తి పరమైన బాధ్యతలు ఎక్కువ అవడం మూలంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు.

working women health issues

కాబట్టి దీర్ఘకాలిక ఒత్తిడి నుంచి వీలైనంత తొందరగా బయటపడితే వారు వారి వృత్తిలో మరింత ముందుకు వెళతారు. ఒత్తిడిని వివిధ పద్దతుల ద్వారా జయించొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన తర్వాత ఒక అరగంట పాటు పాటలు వినడమో, బుక్ చదవడమో,సినిమాలు చూడటమో, ఏదైనా రాయడమో.. లాంటివి చేయడం వల్ల మీ ఒత్తిడి ఇట్టే మటుమాయం అవుతుంది. వర్క్ చేసే ప్లేస్ లో వ్యతిరేక భావనతో అస్సలు ఉండకూడదు. ముఖ్యంగా మీరు చేస్తున్న పనిని ప్రేమించండి. ఇదెంత పని చిటికెలో చేసేయగలననే పాజిటీవిటీని కలిగి ఉండండి. అంతేకాదు మీ కొలిగ్స్ తో సన్నిహితంగా, సరదాగా ఉండండి. ఈ సరదాలో పడి బాస్ చెప్పిన పనిని నిర్లక్ష్యం చేయకూడదు. మీరు చేసే పనిలోనే ఆనందాన్ని వెతుక్కోండి. అప్పుడే మీరు ఒత్తిడికి గురికాకుండా ఉంటారు.

నెలల తరబడి ఆఫీసుల్లో పనిచేస్తూ ఉంటే లైఫ్ బోరింగ్ గా అనిపిస్తుంది. అటువంటప్పడు మీ మనసుకు నచ్చిన మంచి టూరిస్ట్ ప్లేస్ కు వెళ్లి ఎంజాయ్ చేయండి. డిఫరెంట్ ప్లేసెస్ ను చూడటం వల్ల మనసుకు సరికొత్త ఆనందం కలుగుతుంది. ఇలా చేస్తే మీరు తిరిగి ఆఫీసుకు వచ్చినప్పుడు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయగలుగుతారు. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా లోకాన్ని చుట్టే పని పెట్టుకోండి. యోగా, వ్యాయామాలు, రన్నింగ్, వాకింగ్ వంటి వాటి ద్వారా కూడా ఒత్తిడినుంచి బయటపడొచ్చు. వీటి వల్ల ఒత్తిడి తగ్గడమే కాదు.. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ముఖ్యంగా వీటి వల్ల మీ మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. దీనివల్ల మీరు ఒత్తిడి నుంచి ఈజీగా బయటపడతారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *