ఆ సమస్యతో బాధపడేవారు బొప్పాయి పండును అస్సలు తినకూడదు…
కరోనా పుణ్యమా అన్నట్లు ఆరోగ్యంపై ప్రతి ఒక్కరు ధ్యాస పెడుతున్నారు. అధికంగా పండ్లను తీసుకోవడం ద్వారా ఇటు ఆరోగ్యానికి మరియు బరువు సమస్యకు దూరంగా ఉండవచ్చు. వైద్యులు సైతం అందరికీ అధికంగా పండ్లు తీసుకోవడం మంచిదని తెలుపుతున్నారు. సంవత్సరం పొడుగునా దొరికే పండ్లలో బొప్పాయి పండు ఒకటి బొప్పాయి తినడం వల్లన మంచి ఉంది చెడు ఉంది. అయితే బొప్పాయి తినడం వల్ల కొన్ని దుష్ఫలితాలు ఉన్నాయి అవేంటో తెలుసుకోండి మరి.
బొప్పాయిలో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం మరియు మెగ్నీషియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. డెంగ్యూ జ్వరంతో బాధపడేవారు అధికంగా బొప్పాయి తినడం వల్ల డెంగ్యూ జ్వరం నుంచి త్వరగా కోలుకో గలరు. అలానే జీర్ణక్రియ,మధుమేహం, కొలెస్ట్రాల్, బీపి వంటి వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది.
గుండె సంబంధిత వ్యాధితో బాధపడేవారు బొప్పాయి తినడం తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బొప్పాయిలో జీర్ణవ్యవస్థకు సంబంధించిన హైడ్రోజన్ సైనైడ్ ను ఉత్పత్తి చేయగల సైనోజెనిక్ గ్లైకోసైడ్ అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది గుండె వేగంగా కొట్టుకోవడాన్ని కి ప్రేరేపిస్తుంది. అలానే గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినకూడదని వైద్యులు సూచిస్తారు బొప్పాయి అధిక వేడిని కలిగి ఉండడంవల్ల గర్భస్రావం అయ్యే అవకాశాలను అధికం చేస్తుంది. అలానే మూత్రపిండాల్లో రాళ్లు ఈ సమస్యతో బాధపడే వారు కూడా బొప్పాయిని తినకపోవడం మంచిది అని చెబుతున్నారు. బొప్పాయి ఎక్కువగా తినడం వల్ల కాల్షియం ఆక్సలేట్ ఉత్పత్తి అవ్వడంతో రాళ్ళూ కరిగే సమయం తక్కువ ఉంటుందని తెలుపుతున్నారు.