తమలపాకులో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు..!
నాగవల్లి అనే పేరు వినే ఉంటారు. అది మనుషులకే కాదు..ఓ ఆకును కూడా నాగవల్లి అని పిలుస్తారు. అదేంటో అనుకోవద్దు మన తెలుగు రాష్ట్రాల్లో తమలపాకు లేనిదే ఏ శుభకార్యమూ ముందుకు వెళ్లదు. ఆ తమలపాకునే సంస్కృతంలో నాగవల్లి అని పిలుస్తారు. పూజల్లో, పాన్ లో తమలపాకు ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. అదే కాకుండా వైద్యంలోనూ తమలపాకు అధికంగా ఉపయోగించబడుతోంది. అవేంటో చూద్దాం. తమలపాకు రసం తరచూ తీసుకుంటే ముఖంపైన ఉండే మచ్చలు, మొటిమలు ముడతలు తగ్గిపోయి యవ్వనంగా కనిపించేందుకు పని చేస్తుంది. రోజూ తమలపాకు 10 గ్రాముల మిరియాలు కలిపి తింటే బాడీ బరువు తగ్గుతారు.
మోకాళ్ల నొప్పులకు కూడా తమల పాకు పని చేస్తుంది. నొప్పులున్న చోట తమలపాకును బాగా పేస్టుగా మార్చి లేపనంగా రాస్తే తగ్గుతాయి. వాపు ఉన్నా, నొప్పులు ఉన్నా తమలపాకును వేడిచేసి కట్టు కడితే నొప్పులు తగ్గుతాయి. తమల ఆకులను పేస్టులా తయారు చేసి తలకు పట్టించి సుమారు 2 లేదా 3 గంటల తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. జలుబు ఎక్కువగా ఉన్న చిన్నపిల్లల్లో తమలపాకును వేడి చేసి, దానిపై ఆముదం రాసి చాతీమీద ఉంచిచే జలుబు కూడా తగ్గుతుంది. తమలపాకును పొద్దున్నే పరగడుపున నమిలి మింగితే కిడ్నీ స్టోన్స్ తగ్గిపోతాయి.
తమలపాకు రసంలో నిమ్మరసం చేర్చి పరగడుపున తాగితే షుగర్ లెవర్ కంట్రోల్ అవుతుంది. మగ వారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. చెవులపైనా తమలపాకు కాసేపు ఉంచితే కఫము తగ్గి తలనొప్పి తగ్గుతుంది. భోజనం తరవాత తమలపాకు తింటే ఉబ్బసం మరియు ఊబకాయం కూడా తగ్గుతుంది. నేరుగా తమలపాకు నమిలి పుక్కిలిసతే నోటి దుర్వాసన తగ్గుతుంది. చిగుళ్ల నొప్పులు, చిగుళ్ల నుండి రక్తం కారడం లాంటివి తగ్గుతాయి. అధిక తాంబూల సేవనం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అధిక రక్తపోటు ఉన్నవాళ్లు తాంబూలాన్ని తగ్గించాలి.