అందానికి, ఆరోగ్యానికి ఏకైక మార్గం బీట్ రూట్..!
బీట్ రూట్ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బీట్ రూట్ లో ఇనుము అధికంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. దీన్ని రోజు తినటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలానే బీట్ రూట్ రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేయటంతో పాటు రక్తపోటును తగ్గిస్తుంది. ముఖ్యంగా దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని అదుపులో ఉంచుతాయి.
బీట్రూట్ లో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. ఇది చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. బీట్రూట్లో నైట్రేట్ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్ ఆక్సైడ్లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. బీట్రూట్ రసం తాగిన మూడు గంటలకు రక్తపోటులో తగ్గుదల ఉంటుందనీ, దీనివల్ల అనవసర ఆందోళనను దూరం చేసుకోవచ్చనీ ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. క్రీడాకారులు బీట్రూట్ జ్యూస్ తాగి పరిగెత్తినపుడు తక్కువ ఆక్సిజన్ తీసుకుంటారు. అందువల్ల త్వరగా అలసిపోరు.
బీట్ రూట్ రసానికి చెంచా బాదం నూనె, ఒక చుక్క తేనె కలిపి పెదాలకు పూతలా వేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే నల్లగా మారిన పెదాలు గులాబీ రంగులో మెరిసిపోతాయి. మృత కణాలు తొలగిపోవాలంటే బీట్ రూట్ గుజ్జుగా చేసి దానికి చిటికెడు పంచదార కలిపి ఆ మిశ్రమాన్ని పెదాలపై రుద్దాలి. ఇలా చేయటం వల్ల పెదాలు మృధువుగా ఉంటాయి. అయితే బీట్ రూట్ రసాన్ని తలపై రాసుకుని రెండు గంటలపాటు ఆరనిస్తే సహజసిద్ధమైన ఢై వేసుకున్నట్లే. అలాగే హెన్నాలో కాస్త బీట్ రూట్ రసాన్ని కలుపు కుంటే జట్టుకు మంచి రంగు వస్తుంది.