ఏపీ రాజధానిగా అమరావతిని కేంద్రం కూడా అంగీకరించింది- జీవీఎల్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా అమరావతి గురించే చర్చించుకుంటున్నారు. ఏపీ రాజధానిగా గత ప్రభుత్వం అమరావతిని గుర్తించి శంకుస్థాపన కూడా చేయగా.. ఆ తర్వాత వచ్చిన జగన్ సర్కారు 3 రాజధానుల పేరుతో అమరావతిని రాజధానిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో.. అక్కడి రైతులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా, వారి నిరసనలు ఉదృతం చేసి మాహాపాదయాత్ర కూడా చేశారు.
అయితే, ఈ విషయంపై రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. అనంతపురం జిల్లాలో బీజేపీ శిక్షణ తరగుతులు ప్రారంభించిన వేళ.. ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగాలని అన్నారు. కేంద్రం కూడా ఏపీకి రాజధాని అమరావతిగానే గుర్తించిందని.. రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని కేంద్రం కూడా అంగీకరించిందని ఆయన అన్నారు.
కాగా, రాయలసీమలోనే హైకోర్టు పెట్టమని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే తాము చప్పినట్లు గుర్తు చేస్తూ.. ఇప్పుడే ఈ హైకోర్టు వ్యవహారం తేలేలా కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టుకు మధ్య ఉన్న ఉన్న విభేదాలు అందరికీ తెలుసని.. గతంలో రాష్ట్ర విడిపోకముందు రాయలసీమ నుంచే ఎక్కమంది ముఖ్యమంత్రులు అయ్యారని గుర్తు చేశారు.. ఇప్పటికీ రాయలసీమలోని అనంతపురం పూర్తిగా వెనకబడి ఉందని.. రాయలసీమ అభివృద్ధికి బీజేపీ ప్రత్యేక కార్యచరణ చేస్తోందని ఆయన వెల్లడించారు. మరోవైపు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు అన్ని అవకాశాలు కల్పించినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నారు.