నిరూపిస్తే వంగి దండం పెడతాం : సోమిరెడ్డి
వైసీపీ ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో వ్యవసాయశాఖకు ఒక లక్షా పది వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు వ్యవసాయశాఖ మంత్రి చెప్పారని, నిరూపిస్తే వంగి దండం పెడతామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. టీడీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ..‘‘చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు సమస్యలపై ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీలో 9 మంది సభ్యులున్నారు. సీనియర్ టీడీపీ లీడర్లు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. రైతు రాష్ట్ర అధ్యక్షుడు కూడా సభ్యుడే. మూడేళ్లలో రైతుల పై వైసీపీ ప్రభుత్వం అనేకవిధాల దాడికి పాల్పడింది. వ్యవసాయశాఖని నిర్వీర్యం చేసింది.
వ్యవసాయ శాఖ లిటరల్ గా మూతపడింది. ఒక్క రైతు భరోసా కింద రైతు కుటుంబానికి రూ.7,500 మాత్రమే ఇచ్చింది. మొత్తంగా11 వేల కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. మోటార్లకు మీటర్లు-రైతు మెడకు ఉరితాళ్లు అనే నినాదంతో ప్రజల ముందుకెళ్తాం. పంట నష్ట పరిహారంలో జరిగిన అన్యాయం, పంట కాలువలను మరమ్మత్తులు చేయకపోవడం, క్రాప్ హాలిడే తీసుకరావడం, డ్రిప్ ఇరిగేషన్ ను నిర్వీర్యం చేయడం లాంటివాటిని రద్దు చేయడాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాం. టీడీపీ హయాంలో యాంత్రీకరణ మెకనైజేషన్ ని ఒక్క స్మామ్ లో సంవత్సరానికి 4 వందల కోట్లు ఖర్చు పెట్టాం.
స్టేట్ డెవలప్ మెంట్ ఫండ్ లో 2 వందల కోట్ల రైతు రథాలిచ్చాము. 5 ఎకరాలకు ఒక మీటర్ ఇలా దశలవారీగా ఇన్ స్ర్టక్షన్స్ చేయనుంది. అమ్మ ఒడికి పెట్టినట్లుగా ఇందుకు కూడా కొన్ని నిబంధనలు పెట్టనుంది. అర్దరూపాయి, రూపాయి ఇలా పెంచుకుంటూ పోతారు. వీటన్నింటిని ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. టీడీపీ హయాంలో 2017-18లో 12 వేల ట్రాక్టర్లు ఇచ్చాం. 2018-19లో 11 వేల ట్రాక్టర్లు ఇచ్చాం. 23 వేల రైతు రథాలు రైతులకు అందించాం. ఈ పథకాలను కంప్లీట్ గా పడుకోబెట్టాడు. భూసార పరీక్షలు ఆపేశారు. ఈ సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధపడ్డాం. ఒక లక్షా పది వేల కోట్లు ఈ మూడు సంవత్సరాల్లో ఖర్చు పెట్టినట్లు వ్యవసాయశాఖ మంత్రి చెప్పారు’’ అని మండిపడ్డారు.