షూటింగ్‌లో గోపీచంద్‌కు తప్పిన ప్రమాదం

త్వరలోనే పక్కా కమర్షియల్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు గోపీచంద్‌. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 1న విడుదల కానుంది. కాగా ఈ సినిమా తర్వాత శ్రీవాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడీ హీరో. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే లక్ష్యం, లౌక్యం అనే సూపర్‌డూపర్‌ హిట్‌ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కుతోంది. గోపీచంద్‌కు ఇది 30వ సినిమా. ప్రస్తుత కర్ణాటకలోని మైసూర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతుంది. అయితే ఓ ఫైట్ సీన్ కోసం డూప్ లేకుండా పాల్గొన్న గోపీచంద్ ప్రమాదానికి గురయ్యాడు.

Gopichand Falls Down After Slipping His Leg on Sets

షూటింగ్‌ స్పాట్‌లో కాస్త ఎత్తైన ప్రదేశం నుంచి కాలు జారి కింద పడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ ఆయనకు గాయాలు కాలేదని, ప్రస్తుతం గోపీచంద్‌ క్షేమంగానే ఉన్నారని డైరెక్టర్‌ శ్రీవాస్‌ తెలిపారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గోపీచంద్ ప్రమాదానికి గురయ్యాడనే వార్తతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా ఈ సినిమాలో డింపుల్‌ హయతి హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యంగ్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మిక్కీ జే మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. వెట్రి పళని స్వామి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం గోపీచంద్‌పై భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు పలు కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అలాగే ఓ పాట చిత్రీకరించనున్నారు. మే తొలి వారంలో ఈ షెడ్యూల్‌ పూర్తికానుంది. ‘ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సామాజిక సందేశం మిళితమైన బలమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *