టీడీపీ మాజీమంత్రి నారాయణ అరెస్టు

మాజీమంత్రి నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. ప్రశ్నాపత్రాల లీకులో నారాయణ పాత్ర ఉందని అనుమానిస్తూ చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరబాద్ లో కొడుకు వర్థంతి కార్యక్రమంలో ఉన్న నారాయణను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. మొదట ప్రశ్నాపత్రాల అంశంలో అరెస్టు చేయగా..తర్వాత రాజధాని భూముల్లో అవకతవకలపై సీఐడీ అధికారుల ఆదీనంలోకి తీసుకున్నట్లు తెలిసింది. అనంతరం మళ్లీ ప్రశ్నాపత్రాల లీకులతో అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అప్పటికే విచారణలో ఉన్న వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డి కొన్ని కీలక అంశాలను విచారణలో తెలిపారు.

విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సోషల్ పాఠాలు బోధించరని, జేఈఈ, నీట్ కోసం సైన్స్, మ్యాథ్స్ మాత్రమే ఎక్కువగా బోధిస్తారని తెలిపారు.  టెన్త్ లో ఉత్తీర్ణత కోసం నారాయణ విద్యాసంస్థలు ఇలా చేస్తుంటారని,  పరీక్షలకు ముందు స్కూల్ ప్రిన్సిపల్స్, డీన్స్ తో నారాయణ సమావేశమవుతారని,  ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్విజిలేటర్లుగా పనిచేసే టీచర్లను ప్రలోభపెట్టాలని సూచిస్తారు చెప్పినట్లు తెలుస్తోంది. పేపర్ లీక్ లో సహకరించిన టీచర్లకు భారీ నజరానాలు ఇస్తారని గిరిధర్ రెడ్డి చెప్పారు. చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి మాట్లాడుతూ…నారాయణను కస్టడీలోకి తీసుకున్నామని, చిత్తూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో అరెస్టు చేశామని ప్రకటించారు.

అరెస్టు చేసిన ఇతర కాలేజీల సిబ్బంది గతంలో నారాయణలో పనిచేశారని, ఇన్విజిలేటర్ల వివరాలు ముందుగానే తీసుకుని మాల్ ప్రాక్టీస్ చేశారని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే మాల్ ప్రాక్టీస్ చేశారని తెలిపారు. అటెండర్లు, సహాయ సిబ్బంది ద్వారా మాల్ ప్రాక్టీస్ చేశారని, ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. ఇక నారాయణ అరెస్టును టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కక్ష సాధింపుల్లో భాగంగానే అరెస్టు చేశారని, టెన్త్ పేపర్లు లీక్ కాలేదని చెప్పిన  మంత్రులు నారాయణను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. సమస్యలు ఎక్కువైనప్పుడే ప్రభుత్వం ఇలాంటి చౌకబారు పనులకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *