వేగంగా దూసుకెళ్లిన వాహనం.. చివరికి ఏం జరిగిందంటే?
Fast Moving vehicle: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వాహనాలను ఎక్కువ వేగంగా నడుపుతున్న దృశ్యాలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి బుగాటీ కారులో ఏకంగా గంటకు 417 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లి నెటిజన్లను ఎంతగానో ఆశ్చర్యపరిచాడు. దీనీపై జర్మనీ మంత్రిత్వ రవాణా శాఖ సైతం సీరియస్ అవ్వాల్సి వచ్చింది. అసలు ఎం జరిగిందో తెలుసుకుందాం.
చెక్ రిపబ్లిక్ కి చెందిన రాడిమ్ తన బుగాటీ చిరాన్ కారులో ప్రభుత్వ హైవే మీదుగా గంటకు 417 కిలోమీటర్ల వేగంతో నడిపాడు. అది స్పోర్ట్స్ కార్ కాబట్టి అతడు అంత స్టంట్ చేసినా కూడా.. తోటి వాహనాలు నడిపే వారికి ప్రమాదం కలగలేదు. ఏ మాత్రం కుదుపులు లేకుండా ఓ రేంజ్ లో దూసుకు వెళ్ళాడు. అసలు దాని గరిష్ట వేగం గంటకు 500 కిలోమీటర్లు.
కొంచెం ఏదైనా తేడా వచ్చినా.. ఆ వ్యక్తి గాలిలో కలవడమే కాకుండా తోటి వాహనాలకు ప్రమాదం అప్పజెప్పి వెళతాడు. జర్మనీలో ఎటు ఆటోబాన్ అనే హైవేపై కారును నడిపాడు రాడిమ్. దీనికి సంబంధించిన వీడియోని రాడిమ్ “రాడిమ్ పాసర్ ” అనే తన యూట్యూబ్ ఛానల్ లో పంచుకున్నాడు.
ఈ వీడియో చూసిన ప్రభుత్వ రవాణా శాఖ బుధవారం ఓ స్టేట్మెంట్ ఇచ్చింది “ఇలాంటి చర్యలు రోడ్లపై అంగీకరించడం లేదు. ఇలాంటివి చేస్తే రోడ్లపై వెళ్లే ప్రయాణికులకు ప్రమాదం. ప్రతి ఒక్కరూ రోడ్డు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఇతరులకు హాని కలిగించని విధంగా వ్యవహరించాలి”. అని ప్రకటనలో తెలిపింది.