అతిగా మద్యం సేవిస్తే ఈ ప్రమాదాల్లో పడాల్సిందే..

నేటి సమాజంలో మద్యం పాత్ర ఎక్కువే. ఉద్యోగాలు, పెళ్లిల్లు, ప్రమోషన్లు, పుట్టిన రోజులు అంటూ రకరకాల ఫంక్షన్లకు మద్యాన్ని ఒక ఐటెంగా తీసుకొచ్చి పెడతారు. దేశంలోనూ విచ్చలవిడిగా మద్యం విక్రయించబడుతోంది. అన్ని వేళలా బార్లు కిటకిటలాడుతూ ఉంటాయి. మద్యపానం చేసే వారి సంఖ్య ఏటకుయేటా పెరుగుతూన ఉంది అన్ని అనర్థాలకు, అఘాయిత్యాలకు మద్యమే మూల కారణం. పురుషులతో పోటీ పడి మరీ మద్యాన్ని మహిళలు సేవిస్తున్నారు. పురుషుల కంటే మహిళలు అధికంగా మద్యం తీసుకుంటారని, వారి బ్లెడ్ లో ఆల్కహాల్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.  మద్యం తీసుకున్నా మనదేశంలో క్యాన్సర్ల బారినపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇందుకు జన్యుపరమైన కారణాలున్నాయి.

మద్యం వల్ల ప్రమాదకరమైన రసాయనాలు ఉత్పన్నమై మన డీఎన్ఎపై తీవ్ర దుష్ర్పభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని హానికర పదార్థాలను తొలిగించడం కాలేయం చేసే పని. అలాంటి పరిస్థితుల్లో కాలేయానికి ఆల్కాహాలం చెడును చేకూరుస్తుంది. ఆల్కాహాల్ తీసుకున్న తర్వాత కాలేయం పనితీరులో మందగమనం ఉంటుంది. అలాంటి సమయంలో మద్యాన్ని తీసుకోకపోవడమే మంచింది. మద్యం అతిగా తీసుకుంటే ఎప్పుడూ అనారోగ్యంతో ఉన్నవాళ్లు ఆలస్యంగా కోలుకుంటారు.

ఒంట్లో బలాన్ని కోల్పోతారు. పనితీరు పేవలంగా ఉంది. నొప్పులు తగ్గడానికి తాగుతారు అంటారు..కానీ మళ్లీ నొప్పులు పునరావృతం అవుతాయి. తిమ్మిర్లు రావడం, మనిషి బలహీన పడటం వంటివి సంభవిస్తాయి. మద్యం తాగితే సెక్సె ని ఎక్కువసేపు ఆస్వాదించవచ్చని భావిస్తారు కానీ మద్యం వల్ల హార్మోన్స్ ఉత్పత్తి తగ్గి ఆసక్తి, సామర్థ్యం రెండూ తగ్గుతాయి. జ్ణాపక శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. సరిగ్గా ఒకదానిపై దృష్టిపెట్టలేం. మద్యం సేవించడం దీర్ఘకాలం కొనసాగితే కేంద్ర నాడీవ్యవస్థే దెబ్బతినే ప్రమాదం ఉంది. కాళ్లు, చేతులు స్మర్శ కోల్పోతారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *