రాజీనామా చేస్తున్నా..కాజీ జగన్ తోనే ఉంటా : మాజీమంత్రి సుచరిత
కేబినెట్లో మంత్రి పదవి దక్కని వారి అసంతృప్తులు కొనసాగుతున్నాయి. పలువురు అలక వీడినా మరికొందరు అసంతృప్తిలోనే ఉన్నారు. ఆశించిన వారికి కొనసాగించకపోవడంతో పదవులు కోల్పయిన మంత్రులు, పార్టీకి సేవచేసిన వాళ్లు అలకబూనారు. ఇక గుంటూరు జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే మాజీ హోం మంత్రి మేకతోటి సుచరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో చోట కల్పించకపోవడంతో ఆమె ఆదివారమే ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మీడియాతో మాట్లాడటానికి కూడా బయటకు రాలేదు. మంత్రి పదవి దక్కని తర్వాత సోమవారం మీడియా ముందుకు వచ్చిన ఆమె స్పందించారు.
మంత్రి పదవి రెండున్నరేళ్లే అని జగన్ ముందే చెప్పారన్నారు. మంత్రి పదవి పోయినందుకు బాధగా లేదని, కానీ.. కొన్ని కారణాలు నన్ను బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత కారణాలతోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. తన వల్ల పార్టీకి చెడ్డపేరు రాకూడదని పేర్కొన్నారు. పదవిలో ఉన్నా లేకుపోయినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని వివరించారు.
పార్టీ కార్యకర్తలంతా సంయమనం పాటించాలని సూచించారు. అంతక ముందు సుచరిత అభిమానులు సీఎంకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆమెను బుజ్జగించేందుకు ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆమె ఇంటికి వెళ్లగా.. తన రాజీనామా లేఖను ఆయన చేతిలో పెట్టారని సమాచారం. ఇదే ఆమె కుమార్తె రిషిత స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేశారని.. పార్టీకి కాదని తెలిపారు. అయితే త్వరలోనే సీఎం జగన్ ను కలిసి తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.