ఈ ఆహార పదార్థాలు మూడుసార్లు తింటే చాలు వందేళ్లు ఆయుష్షు గ్యారెంటీ!
ప్రస్తుత కాలంలో మన ఆహార విషయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోవడం వల్ల మన శరీరంలో కూడా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే చిన్నవయసులోనే అధిక శరీర బరువు పెరగడంతో పాటు వివిధ రకాల కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే డయాబెటిస్, బీపీ వంటి సమస్యలు కూడా ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. ఈ విధమైనటువంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఆహార పదార్థాలను తినడం వల్ల ఎలాంటి నొప్పులు లేకుండా 100 సంవత్సరాలు ఎంతో ప్రశాంతంగా బ్రతుకుతారు.
ప్రతిరోజూ నల్ల శనగలు బాదం పప్పు బెల్లం ఈ మూడింటిని కలిపి తినడం వల్ల మన శరీరంలో ఏ విధమైనటువంటి కీళ్ళనొప్పులు కండరాల నొప్పులు మోకాళ్ళ నొప్పి వంటి సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. అయితే ముందు రోజు రాత్రి ఒక స్పూన్ నల్ల శనగలు, నాలుగు బాదం పప్పులను నానబెట్టి మరుసటి రోజు ఉదయం సెనగలు పొట్టుతీసి వీటిని కలిపి తినాలి.వీటితోపాటు బెల్లం ముక్క తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు సక్రమంగా అందుతాయి.
ఇలా ఈ చిన్న చిట్కాలు పాటించడం వల్ల ఏ విధమైనటువంటి నొప్పులు లేకుండా ఎంతో ఆరోగ్యవంతంగా ఉండగలము. ఈ మూడింటిని కలిపి తినడం వల్ల కేవలం శరీరంలో ఏర్పడే నొప్పులు మాత్రమే కాకుండా రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారికి నిలకడ స్థాయిలో ఉంటుంది.అయితే ప్రతిరోజు తినలేని వారు వారంలో మూడు రోజులు ఉదయం లేదా సాయంత్రం వీటిని తినడం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.