పొద్దుటి పూట ఒకగ్లాసు నీళ్లు తాగండి…!

సాధారణంగా లేవగానే ఎవరైనా వారి పనుల్లోకి వెళ్లిపోతారు. పరగడపున నీళ్లు తాగాడానికి కొందరు ఇష్టపడరు. అంతేకాదు తాగే అలవాటు కూడా చాలా మందికి తక్కువగా ఉంటుంది. అయితే పరగడపున నీళ్లు తాగితే చాలా మంచిదని చెప్తున్నారు డాక్టర్లు. పరగడపున నీళ్లు తాగితే వచ్చే ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా తాగాల్సిందే. అవేంటో చేద్దామా.? పరగడపున ఒక గ్లాసు మంచినీళ్లు తాగడం వల్ల అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శ్వేత దాతువులను సమతుల్యయం చేస్తుంది. శ్వేత గంధ్రుల్లో ఆటంకాలు తొలగిపోతాయి.

ఆ గ్రంథుల వలన రోజు వారీ కార్యక్రమాలల్లో ఎలాంటి ఆటంకం లేకుండా, శరీర ద్రవ పదార్థాన్ని కోల్పోకుండా, ఇన్ ఫెక్సన్ దరి చేరకుండా పోరాడుతుంది. కొత్త రక్తం తయారీని, కండరాల కణాల వృద్ధిని పంచుతుంది.  పరగడుపునే తాగడం వల్ల పెద్ద పేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది. రక్త కణాలను శుద్ధి చేయడం వల్ల శరీరంలోని మలినాలు తొలగి పోతాయి. దాంతో శరీర ఛాయ ప్రకాశిస్తుంది.. అంతేకాదు పొద్దున్నే కనీసం అరలీటరు నీటిని తాగడం వల్ల 24 శాతం శరీర మెటబాలిజాన్ని పెంచుతుంది.

నీరు తాగటం వల్ల కడుపు నిండుగా ఉన్న భావన కలిగి ఆహారం మితంగా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. శరీరంలో అధికంగా ఉన్న వేడి తొలగించుకునేందుకు పరగడుపున నీటిని తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు దరి చేరకుండా చూసుకోవచ్చు. ఊబకాయంతో బాధపడేవారు రోజు పరగడుపున నీళ్లు తాగితే బరువు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. మంచి నీరు తాగిన గంట సేపటి వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *