Health Tips: ఇలా చేస్తే గొంతు నొప్పి ఇట్టే తగ్గిపోతుందట!
Health Tips: గొంతు నొప్పి.. సాధారణంగా జలుబు, దంతాలు సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల, ఫ్లూ చాలా కారణాలలో వస్తుంది. అంతేకాకుండా ప్రజలను వేధిస్తున్న కరోనా మహమ్మారి లక్షణాలలో గొంతు నొప్పి ప్రధాన కారణం. వర్షాకాలంలో కూడా మనకు గొంతు నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో గొంతు నొప్పితో మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంటుంది.
గొంతు కూడా బొంగురుపోతుంది. కాబట్టి ఈ నొప్పికి వేడి ద్రవాలను తీసుకుంటే మనకు కొంత వరకు ఉపశమనం కలుగుతుందని భావించి వేడి పాలల్లో మిరియాల కలిపి తీసుకుంటాం. ఇది కొంత వరకు ఉపశమనం కలిగించి నప్పటికీ గొంతు నొప్పి మాత్రం అలానే ఉంటుంది. కానీ ఈ సమస్యలు కొన్ని చిట్కాల ద్వారా ఇంటి వద్దనే చెక్ పెట్టవచ్చని తెలుస్తుంది. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కొంచెం అల్లం తీసుకొని దానిని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. ఆ తర్వాత ఒక పాత్రలో కొంత వరకు నీటిని తీసుకొని ఆ అల్లం ముక్కలు అందులో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత జల్లెడైన వెచ్చని నీటిని ఒక గ్లాసు లోకి తీసుకొని అందులో ఒక చెంచా తేనెను కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా గొంతుకు చాలా ఉపశమనం కలుగుతుంది.
ఒక కప్పులో కొన్ని తులసి ఆకులను, నాలుగు నుంచి ఐదు వరకు మిరియాలను వేసి బాగా ఉడకబెట్టాలి. అలా చేసిన కషాయాన్ని రాత్రిపూట నిద్ర పోయే సమయంలో తాగితే మంచి ఫలితం దక్కుతుంది. అంతే కాకుండా పెద్దలకు కూడా త్వరగా మాయమవుతుంది. గొంతు నొప్పి అనిపించినప్పుడు గోరువెచ్చని నీటిని తీసుకోవడం మంచిది. ఈ గోరువెచ్చని నీటిలో కొంత వెనిగర్ వేసి గార్జింగ్ చేస్తే గొంతు నొప్పి మటుమాయం అవుతుంది.
ఒకవేళ వెనిగర్ లేకపోయినా గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి కూడా ఇలా చేయవచ్చు. నేతిలో మిరియాల పొడి కలిపి తీసుకుంటే గొంతు నొప్పికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నల్ల మిరియాలతో పాటు బాదం పప్పులు కలిపి నూరి నీటిలో కలిపి తీసుకోవడం వల్ల గొంతు సమస్యల పట్ల మంచి ఫలితం దక్కుతుంది. అంతేకాకుండా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి కొంచెం తేనె కలుపుకుని సేవించడం వలన గొంతు నొప్పిని దూరం పెట్టవచ్చు.