జగన్ కు బానిస బతుకు అవసరమా.? : సీపీఐ నారాయణ

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రజలు 151 సీట్లు ఇచ్చినా జగన్‍మోహన్ రెడ్డికి బానిస బదుకు అవసరమా? అని ప్రశ్నించారు. బీజేపీ కనుసన్నల్లో రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతోందని విమర్శించారు. నారాయణ మంగళవారం మీడియాతో మాట్లాడారు. గత పాలన చూసి చంద్రబాబుకు 23 సీట్లయినా వచ్చాయని, రేపు జగన్‍మోహన్ రెడ్డికి అని కూడా రావని జోష్యం చెప్పారు. అధికారం ఉందని ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు చేస్తారా అని ప్రశ్నించారు. వాటన్నింటికీ గవర్నర్ ఆమోదం ఎలా తెలుపుతారని నిలదీశారు. నేనే గవర్నర్‍గా ఉంటే ఆత్మహత్య చేసుకునేవాడిని సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశంలో ఎర్రజెండాల ప్రాముఖ్యత పెరగాలంటే సీపీఎం, సీపీఐ కలవాలని అభిప్రాయపడ్డారు. కేరళలో జరిగే సభలో సీపీఐ, సీపీఎం కలవాలన్న అంశాన్ని చర్చిస్తామని పేర్కొన్నారు. సీపీఎం, సీపీఐ కలిసి పనిచేసేలా తీర్మానం చేస్తామని ప్రకటించారు. అదానీకి సముద్ర తీర ప్రాంతాన్ని కట్ట పెట్టారు మోడీ, జగన్ లు అదానీకి ఊడిగం చేస్తూ, ప్రభుత్వ ఆస్తులను అప్పగించారన్నారు. ముంద్రా పోర్ట్ ద్వారా మత్తు పదార్థాల రవాణా జరుగుతోందని, జల రవాణా ద్వారా అనేక అసాంఘిక కార్యకలాపాలు నడుస్తున్నాయన్నారు.

పవన విద్యుత్, సోలార్ విద్యుత్ అదానీకే ఎక్కువుగా ఉంది అదానీ ని నెత్తిన పెట్టుకుని ఆర్ధిక వ్యవస్థ ను కట్టబెడుతున్నారని, చిలక పలుకులు పలికే నిర్మలా సీతారామన్ కి ఇవేమీ తెలియవాప్రజా వ్యతిరేక విధానాల పై వామపక్ష పార్టీలు పోరాటం చేస్తాయన్నారు. బీజేపీకి సహకరించాలని భావించిన కేసీఆర్ నే ముంచి, తెలంగాణలో అధికారం లోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ చాలా గట్టిగా మాట్లాడుతున్నారని, రాబోయే రోజుల్లో బీజేపీ వ్యతిరేక పార్టీ లను ఏకం చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.

 

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *