మెరిసే ముఖం మీ వశం కవాలా.?

ఈ రోజుల్లో అమ్మాయిల దగ్గర నుండి వృద్ధుల వరకు ముఖ సౌందర్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. దీని కోసం రకరకాల టిప్స్ పాటించడంతోపాటు బ్యూటీ పార్లర్లకు కూడా క్యూ కడుతుంటారు. అయితే డబ్బులు ఎక్కువ ఖర్చు చేయకుండా, తక్కువ ఖర్చుతో ముఖ సౌందర్యాన్ని పెంచుకునే చిట్కాలు మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలా అంటారా ఇది చూసి తెలుసుకోండి. కేవలం ముఖానికి పూతలు వేసుకోవడమే కాదు… నలుగు పెట్టుకోవడం వల్ల కూడా చర్మ యవ్వనంగా కనిపిస్తుంది. చెంపలు నిగారింపు పొందుతాయి. పావుకప్పు నిమ్మరసంలో  పాలు కలిపి దాంతో చెంపలకు రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తే చెంప భాగంలో రక్త ప్రసరణ పెరిగి గులాబీ రంగులోకి ముఖం మారుతుంది.

కీరదోసను ముక్కులు, ముక్కులుగా చేసుకోవాలి. వాటిని గుజ్జుచేసుకుని పావుకప్పు నిమ్మరసం, అయిదు చెంచాల తేనె, పాలు కలిపి బాగా కలపాలి. ఈ గుజ్జు మరీ జోరుగా ఉంటే, కొంచం వరిపిండి కలిపి గట్టిగా చేసుకోవాలి. ఈ గుజ్జును అయిదు నుండి ఆరు గంటల వరకు ఫ్రిజ్ లో పెట్టాలి. తీసిన తరువాత దాన్ని ముఖానికి పూతలా రాసుకోవాలి. రాసుకున్న మిశ్రమాన్ని ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి కడుక్కోవాలి.

శనగపిండిని రెండు మూడు చెంచాలు తీసుకుని, దాంట్లో పాల మీగడ, మూడు చెంచాల గోధుమల పొట్టు, కొంచం పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడుక్కుంటే ముఖం సౌందర్యంగా ఉంటుంది.ఇక బీట్ రూట్ కూడా ముఖ సౌందర్యానికి బాగా ఉపకరిస్తుంది. బీట్ రూట్ ను తీసుకుని బాగా ఉడకబెట్టాలి. వాటిని మిక్సీలో వేసి మెత్తగా చేసి, రెండు చెంచాల పాలు, చెంచా తేనె కలుపుకుని బాగా కలపాలి. తరువాత ఆ మిశ్రమాన్ని ముఖానికి మెడకు రాసుకుని అరగంట దాకా ఆరబెట్టుకోవాలి. తర్వాత మంచినీళ్లతో కడుక్కుంటే ముకం సౌందర్యవంతంగా మారుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *