అతడు సినిమా బ్రహ్మానందం కొడుకు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా.. చూస్తే మతిపోవాల్సిందే!

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం అతడు. అందులో బ్రహ్మానందం కొడుకు పాత్రలో ఓ బుడ్డోడు నటించాడు.నాన్న ట్రైన్ తెమన్నాను తీసుకొచ్చావా అంటూ బ్రహ్మానందాన్ని అడగడంతో అప్పుడు బ్రహ్మానందం తీసుకొచ్చాను పట్టాల మీద పెట్టాను వెళ్లి తీసుకురాపో అంటూ బ్రహ్మానందం చేసిన కామెడీ అందరికీ గుర్తుండే ఉంటుంది.మరి చిన్నప్పుడు బ్రహ్మానందం కొడుకు పాత్రలో నటించిన ఈ బుడ్డోడు దాదాపు 20 చిత్రాల్లో నటించాడు. ఇలా బాల నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈ కుర్రాడు అసలు పేరు దీపక్.

సుమారు 20 చిత్రాల్లో బాలనటుడిగా నటించి అనంతరం చదువుల కోసం ఇండస్ట్రీకి దూరమైన దీపక్ ప్రస్తుత చదువులు పూర్తి చేసుకుని సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోని ఇతనుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు చూసిన ఎంతో మంది ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోల ఫిజిక్ కి ఏమాత్రం తీసిపోకుండా ఉన్న దీపక్ ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈయన 2014 సంవత్సరంలో మిణుగురులు సినిమాలో నటించారు. ఈ సినిమాలో నటించినందుకు గానూ నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్న అనంతరం కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు ప్రస్తుతం తన చదువును పూర్తి కావడంతో తన పూర్తి దృష్టి సినిమాలపై పెట్టినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే అవకాశాల కోసం ఎదురు చూస్తూ తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఇక ఈయన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా రానున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ అందులో నిజం లేదని తెలిసిపోయింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *