కేసీఆర్ పక్కన కూర్చున్న తండా మహిళ ఎవరంటే..?

మా తండాల్లో ఉండేవాళ్లకు పిల్లనివ్వడం లేదు, త్రీఫేజ్ కరెంట్ లేదు,  ఇక్కడ బతకాలంటే నెత్తిన బిందెలు పెట్టుకుని మూడు కి.మీ నీళ్లు మోయాలి, ఇలాంటి ప్రాంతానికి పిల్లను ఎవరు ఇస్తారు అంటూ ఆరేళ్ల క్రితం మంత్రి హరీష్ రావును ఓ గిరిజన మహిళ ప్రశ్నించింది. ఆమె పేరే చిమ్మిబాయి. అయితే ఏకంగా ఇటీవల కేసీఆర్ పక్కన వేదిక కూడా పంచుకుంది. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల నిర్మాణానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ నారాయణఖేడ్‌లో శంకుస్థాపన చేశారు. అక్కడ జరిగిన బహిరంగ సభకు చిమ్నిబాయి వచ్చింది. తర్వాత ఏం జరిగిందంటే..

నారాయణ ఖేడ్ వచ్చిన హరీష్ రావు ఆరేళ్ల క్రితం చిమ్మిబాయితో జరిగిన సంభాషణను గుర్తుకు తెచ్చకున్నారు. ఆమె గురించి తీశారు. అయితే ఆ బహిరంగ సభలోనే చిమ్మిబాయి పాల్గొంది. విషయాన్ని కేసీఆర్ చెవిలో హరీష్ రావు వేశారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేదికపైకి పిలిచి చిమ్నిబాయిని పక్కనే కూర్చోబెట్టుకున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నాయో,  కుటుంబం, పరిస్థితుల గురించి కేసీఆర్ ఆరాతీశారు. కేసీఆర్ దృష్టికి చిమ్నిబాయి తీసుకువచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కారం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో అందరి చూపు సభలో ఆమెవైపే మళ్లింది. చిమ్మిబాయి గ్రేట్ అంటూ సభలో కింద కూర్చున్నవారి కళ్లలో ఆనందం వెలుగు చూసింది

 

గతంలో చేసిన ఆమె అభ్యర్థనతో తండాలో రూ.20 లక్షల నిధులతో ఎస్టీ కమ్యూనిటీ భవనాన్ని, రూ.15 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మించారు. తండాలో అనారోగ్యం బారిన పడిన వారికి సీఎం సహాయనిధి అందేలా కృషి చేశారు.  జీవితంలో కేసీఆర్‌ ను హరీశ్‌రావు మర్చిపోను, కేసీఆర్‌ దేవుడని తెగ పొగుడుతూ మురిసిపోయింది. తనకు ఏ సమస్య వచ్చినా మంత్రి హరీశ్‌రావు, ఉన్నారని, నాకు తండ్రి, అన్నదమ్ములు అంతా వాళ్లే టీఆర్ఎస్ పార్టీ నాయకులనేనని చిమ్మిబాయి పేర్కొన్నారు. కేసీఆర్ తో పక్కన కూర్చున్న ఫోటోలను చూసుకుంటూ మురిసిపోతోంది చిమ్మిబాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *