రైతులు న్యాయ దేవతకు మొక్కడం వైసీపీకి వెకిలిగా ఉందా..? టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణానికి మొట్ట మొదట ప్రాణ సమానమైన భూముల్ని త్యాగం చేసి పునాది రాయి వేసింది రైతులే. రైతులు న్యాయ దేవతను మొక్కడం వైసీపీకి వెకిలిగా ఉందా.? మూడేళ్లుగా మూడు రాజధానుల పేరుతో చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్న వైసీపీ నేతలకు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మింగుడు పడటం లేదు. కోర్టు తీర్పులతోనైనా బుద్ధి తెచ్చుకోకుండా నోటికొచ్చినట్లు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. 807 రోజులపాటు రైతులు చేసిన పోరాటానికి ఫలితం దక్కింది.
రూ.15 వేల కోట్లతో పనులు చేపట్టి నిర్మాణాలు పూర్తి చేస్తే గ్రాఫిక్స్ అనడానికి మనసెలా ఒప్పంది.? రాజధాని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిసినా మొండిగా ప్రవర్తించి ప్రజాధనం వృధా చేశారు. అభివృద్ధిని వికేంద్రీకరించడని ప్రజలు కోరితుంటే పాలన వికేంద్రీకరణ చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. మూడేళ్లుగా ఎక్కడ ఏ ఉపాధి కల్పించారో వైసీపీ సమాధానం చెప్పాలి. రాజధానికి లక్ష కోట్లు ఖర్చు పట్టాలని చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఇంకా మానడం లేదు. దాన్ని అమలు చేసుకోవడం వైసీపీ చేతకాలేదు.
విజనరీ ఉన్నవాళ్లకు తప్ప విధ్వంసాలు సృస్టించేవారికి రాజధాని నిర్మించడం చేతకాదు. 189 మంది రైతుల ప్రాణత్యాగాలను వైసీపీ చులకన చేసి మాట్లాడుతోంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని దొంగ పత్రికలో అసత్యాలు ప్రచారం చేశారు. రాజధానిని కొసాగించి 139 సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను కొనసాగించి ఉంటే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించేవి. ఇకనైనా మాస్టర్ ప్లాన్ అమలు చేసి రాజధానిని నిర్మించాలి. మహిళలు, వృద్దులు, పిల్లలు అని చూడకుండా లాఠీచార్జ్ చేసి, అక్రమంగా ఎట్రాసిటీ కేసులు పెట్టి జైళ్ళలో నిర్భందించారు. రైతుల పాపం ప్రభుత్వానికి ఊరికేపోదు.