‘బండి’తో చర్చలకు వచ్చిన ఆ నేతలు..!

తెలంగాణ బీజేపీలో గత కొన్ని రోజులుగా తిరుగుబాటు చేస్తున నేతలు బండి సంజయ్‌తో చర్చలకు దిగి వచ్చారు. పార్టీలో గుర్తింపు, చూపుతున్న వివక్షను గురించి తిరుగుబాటు నేతలు సంజయ్ కు వివరించారు. మీతో ఎలాంటి ఇబ్బందీ లేదని, చిన్న చిన్న బేదాభిప్రాయాలను మాత్రమే ఉన్నట్లు చర్చలో ప్రస్తావించారు. తమ పొరపాటును అసమ్మతి నేతలు సవరించుకున్నారని బండి అభిప్రాయపడుతున్నారు. ఇకపై అందరినీ కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బండి వద్ద నేతలు భావించారు. బీజేపీలో కొన్ని రోజులుగా నేతలు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికి సుమారు రెండుమూడు సార్లు రహస్యంగా సంజయ్ కి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించారు.

Dissent leaders' talks with Bandi Sanjay

అది కూడా కరీంనగర్ కు  చెందిన గుజ్జుల రామకృష్ణారెడ్డి, అర్జున్‌రావు తీవ్రం అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ పెద్దలు అనర్హత వేటు వేయాలని కూడా భావించారు. అయితే ఇది మరో మలుపు తిరిగింది. అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు పెద్దలు రంగంలోకి దిగి వారి అభిప్రాయాలను అధిష్టానం చెవిలో వేశారు. దీనిపై సుముఖత వ్యక్తం చేయడంతో అలకవీడిని నేతలు బండి సంజయ్ తో సమావేశమయ్యారు. తమ ఇబ్బందులను, పార్టీ ఎదుర్కొంటున్న అవమానాలను వివరించారు. అయితే బీజేపీకి బుజ్జగించే సంస్కృతి వస్తోందని కార్యకర్తలు ఆందోళన పడుతున్నారు.

ఇదివరకెన్నడూ లేని విధానం ప్రస్తుతం బీజేపీకి రావడం వారికి మింగుడు పడటం లేదు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతున్నామంటూ చెప్పే బీజేపీకి ఇప్పుడు నేతల వ్యతిరేక రాగాలు తలనొప్పులుగా మారుతున్నాయి. అది కూడా అధ్యక్షుడు సొంత జిల్లా నుండి అసమ్మతి బయటపడటం పెద్దల మనుసులో గుబులు రేపుతోంది. ఈ కల్చర్ పక్క జిల్లాలకు పాకకుండా, అందరినీ ఏకతాటిపై ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. త్వరలో జాతీయ నాయకత్వంతో సమావేశం తర్వాత చిన్నచిన్న  పొరపాట్లు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *