భార్య భర్తలు ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఏడాది 60 వేలు పొందవచ్చు తెలుసా..?

పోస్ట్ ఆఫీస్ ఇప్పటికే ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో రకాల స్కీమ్స్ తీసుకువస్తూ ఎంతోమందికి ప్రయోజనకరంగా మారిందని చెప్పవచ్చు. డబ్బులు పొదుపు చేయాలి అనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ సేవలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ లో డబ్బులను ఉంచడం వల్ల మన డబ్బుకు ఎలాంటి భయాందోళనలు వ్యక్తం చేయాల్సిన పని లేదని చెప్పవచ్చు. ఇలా పోస్ట్ ఆఫీస్ అందించే సేవల ద్వారా డబ్బును పెట్టి నెల నెల మంచి ఆదాయాలను పొందవచ్చు.

ఈ క్రమంలోనే స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా వెయ్యి రూపాయల నుంచి 4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టి నెలనెల లేదా ప్రతి ఏడాదికి ఒకసారి డబ్బు నుంచి వచ్చే వడ్డీ డబ్బులను మనం పొందవచ్చు. ఈ స్కీమ్ ద్వారా కేవలం ఒకరు లేదా భార్యాభర్తలిద్దరూ అయినా పెట్టుబడి పెట్టవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జాయింట్ అకౌంట్ తెరిస్తే వారు 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ఈ పథకంలో డబ్బులు అన్నీ ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే ఐదు నెలల కాలం వరకు మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ డబ్బులను డ్రా చేసుకోకూడదు. కానీ ఇన్వెస్ట్ చేసిన మొదటి నెల నుంచి వడ్డీ పొందవచ్చు. ఇక భార్యాభర్తలిద్దరూ జాయింట్ అకౌంట్ తెరవాల్సి ఉంటుంది ఇలా భార్యాభర్తలిద్దరూ ఈ పథకంలో చేరితే ఒకేసారి తొమ్మిది లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. ఇలా తొమ్మిది లక్షలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత నెల నెల 5,000 ఆదాయం పొందవచ్చు లేదంటే ఏడాదికి ఒకసారి 60 వేల ఆదాయం పొందవచ్చు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *