ఆసుపత్రిలో చేరిన ధనుష్ మాజీ భార్య.. అసలు ఏం జరిగిందంటే!

Dhanush And Aishwarya: టాలీవుడ్ ప్రేక్షకులకు కోలీవుడ్ నటుడు ధనుష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘నవమన్మధుడు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో.. ఆ పై పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులతో వేరే స్థాయిలో ర్యాపో పెంచుకున్నాడు. ఇక ధనుష్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనకు తెలిసిందే. ప్రస్తుతం సినీ అగ్రస్థాయి స్టార్ హీరోలలో తాను ఒకడుగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.

Dhanush And Aishwarya
Dhanush And Aishwarya

ఇక ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురైన ఐశ్వర్య పెళ్లి చేసుకోగా ఇటీవలే వీరిద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని ధనుష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ విషయాన్ని నార్మల్ పీపుల్స్ నుంచి సెలెబ్రేటిలు సైతం జీర్ణించుకోలేకపోయారు.

ఇదిలా ఉంటే తాజాగా ధనుష్ మాజీ భార్య హాస్పిటల్లో జాయిన్ అయినట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఐశ్వర్య నే స్వయంగా తన ఇన్ స్టా ఖాతా ద్వారా వెల్లడించింది. ‘అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా బాధ తప్ప లేదు. హాస్పటల్ లో జాయిన్ అయ్యాను. దయచేసి అందరూ మాస్కులు వేసుకుని జాగ్రత్తగా ఉండండి’.

‘2022 ఇంకా నాకోసం ఏమీ కొత్తగా చూపిస్తావో అంటూ.. తన ఇన్ స్టా లో పంచుకుంది ఐశ్వర్య. ఈ విషయం తెలిసిన తన అభిమానులు ఎంతో బాధను వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. ఇక ఐశ్వర్య, ధనుష్ మాజీ భార్య కాబట్టి ఈ క్రమంలో ఏమన్నా స్పందిస్తాడో చూడాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *