అఖండ కోసం గోల చేస్తున్న బాలీవుడ్ ప్రేక్షకులు!

Balakrishna: సినీ నటుడు బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘అఖండ’. ఈ సినిమాలో శ్రీకాంత్, అందాల బ్యూటీ జైస్వాల్, పూర్ణ, సునీల్ శెట్టి లు మెయిన్ రోల్స్ చేశారు. ఇక మొన్నటివరకు థియేటర్లలో బాలయ్య తన ప్రత్యేక మానరిజం తో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాడు. అలా.. బాలయ్య బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాడు.

ఇక ఈ సినిమా 103 సెంటర్లలో సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీ లో విడుదలైన ఈ సినిమా కేవలం ఆరు గంటల్లో 10 లక్షల స్ట్రీమింగ్స్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే అఖండ మూవీ కోసం బీ టౌన్ పీపుల్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

ఇదే సినిమా బాలీవుడ్ వెర్షన్ లో కావాలని బాలీవుడ్ ప్రేక్షకులు సోషల్ మీడియా ఇన్ స్టా లో పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. అఖండ సినిమా తెలుగు వర్షన్ లో వేరే స్థాయిలో ఉంది. కాబట్టి ఈ సినిమాను హిందీ వెర్షన్ లో కూడా విడుదల చేస్తే బావుంటుంది అని నార్త్ ఇండియన్స్ గోల చేస్తున్నారు.

అంతేకాకుండా సదరు బాలీవుడ్ ఆడియన్స్ కూడా అఖండ మూవీ ని హిందీ లో విడుదల చేయండి అంటూ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. ”అఖండ మూవీ ప్రౌడ్ ఫర్ సనాతన్” ధర్మ అంటూ హిందీ వర్షన్ ఈ మూవీ కోరుకుంటుంది. అంతేకాకుండా వి వాంట్ అఖండ మూవీ ఇన్ హిందీ అని హ్యాష్ టాగ్ లు కూడా చేస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *