ఓవర్ నైట్ స్టార్​ గా మారిన కేరళ కూలీ… ఎలా అంటే ?

జీవితం ఎవరిని ఎప్పుడు పైకి లేపుతుందో… ఎవరిని ఎప్పుడు కిందకు పడేస్తుందో తెలియదు. అందుకే పెద్దలు బండ్లు ఓడలు అవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి అని అంటుంటారు. ఇలాంటి వాటికి కరెక్ట్ గా సరిపోయే ఓ వ్యక్తి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నా, మొన్నటి వరకు ఆయనో సామాన్య రోజువారీ కూలీ. ఎప్పుడు పని దొరికితే.. అది చేసుకుని కడుపు నింపుకుందామా అని అనుకుంటా ఉంటాడు. వచ్చిన నాలుగు రాళ్లను వెనకేసుకునే పని అయితే అసలే లేదని చెప్పాలి. పక్కా పల్లెటూరు కూలీగా ఉంటాడు. మాసిపోయిన జుత్తు, గళ్ల లుంగీ, తలకి టవాలు చుట్టుకుని కనిపించేవాడు.

Daily wage labourer, 60, from Kerala becomes a model
Daily wage labourer, 60, from Kerala becomes a model

అయితే ఆయనకు అదృష్టం ఓ ఫోటోగ్రాఫర్ రూపంలో కలిసి వచ్చింది. అంతే అప్పటి వరకు సాదాసీదాగా ఉన్న ఓ వ్యక్తి ఓవర్ నైట్ లో ఏకంగా మోడల్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఆయన ఇప్పుడు కేర‌ళ‌లో రోల్ మోడ‌ల్ గా మారిపోయాడు. షాకింగ్ మేకోవ‌ర్‌తో నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఆయన పేరే మామిక్క. ఈయన కేరళలోని కొజికోడ్​ లో రోజు వారి రోడ్డు పనికి పోయేవారు. అలాంటి వ్యక్తి స్విస్ మేకోవ‌ర్‌తో కనిపించి అందరికీ షాకిచ్చాడు. అయితే గతంలో ఆయన కూలిపని చేసుకునేటప్పుడు దిగిన ఫోటోలు ఇప్పడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
మామిక్కను ఆ విధంగా తయారు చేసిన ఘనత అంతా ష‌రీక్ వ‌యాలిల్ అనే ఫొటోగ్రాఫ‌ర్ కు దక్కుతుంది. ఆయన తీసుకున్న చొరవ వలనే మామిక్కను ఈ ఇమేజ్ దక్కింది. తాను అనుకున్న దాని ప్రకారంగా ఆయన మేకోవ‌ర్‌ను పూర్తిగా మార్చేశారు. చూడచక్కని వెడ్డింగ్ సూట్, అద్దిరిపోయే షూష్‌, స్టైలిష్ కళ్ల అద్దాలు, రిచ్ లుక్ కనిపించేలా ఉన్న చిన్న వీడియోను షూట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ గా మారింది. ఆరు పదుల వయసులోనూ ఆయన ఫిట్ నెస్ చూసిన కొందరు జేమ్స్ బాండ్ల ఉన్నవని అంటున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *