టీడీపీతో రాజకీయ అరంగ్రేటం చేయనున్న దగ్గుపాటి వారసుడు..?

దగ్గుపాటి..రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీతో దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాజకీయ అరంగ్రేటం చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడంలో కీలకపాత్ర పోషించారు. తదనంతరం జరిగిన పరిణామాలతో దగ్గుపాటి కుటుంబం కాంగ్రెస్ లో చేరింది. వెంకటేశ్వరరావు,  పురంధేశ్వరిలో ఒకరు ఎమ్మెల్యేగా ఉండగా, మరొకరు కేంద్రమంత్రిగా వ్యవహరించారు. సాఫీగా సాగుతున్న వారి రాజకీయ జీవితానికి  రాష్ట్ర విభజన పెద్ద కష్టమే తెచ్చిపెట్టింది. విభజన తర్వాత బీజేపీలో చేరడం, ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి ఓడిపోవడం కూడా జరిగింది. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసిన పురంధ్వేశ్వరికి డిపాజిట్లు కూడా రాలేదు.

2019 ఎన్నికల ముందు కొడుకు హితేష్ తో పాటు వైసీపీలో చేరారు వెంకటేశ్వరరావు. కొడుకును పర్చూరు నుండి పోటీ దింపాలనుకునే సమయానికి కొన్ని కారణాల వల్ల హితేష్ ను తప్పించి ఏకంగా వెంటేశ్వరరావు బరిలోకి దిగారు. అయినా ఆయన గెలుపు సాధ్య పడలేదు. అప్పటికే మంచి అంగబలం సంపాధించుకున్న ఏలూరి సాంబశివరావు చేతిలో పరాజయం పాలయ్యారు. ఇది జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు వెంకటేశ్వరరావు. కొద్ది నెలల క్రితం చంద్రబాబు, వెంకటేశ్వరరావు పెళ్లి వేడుకలో కలిశారు. మనసు విప్పి సరదాగా మాట్లాడుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి.

పర్చూరు నుండి హితేష్ టీడీపీ అభ్యర్థిగా పోటీకి వచ్చే ఎన్నికల్లో దిగుతారని ప్రచారం సాగుతోంది. అయితే పర్చూరులో ఏలూరినే పోటీ చేస్తాడని, హితేష్ ను చీరాల అభ్యర్థిగా దించుతారని గుసగుసలు వినబడుతున్నాయి. దీంతో హితేష్ రాజకీయ అరంగ్రేటం చేసినట్లు ఉంటుంది, దశాబ్ధాలుగా ఉప్పూనిప్పులా ఉన్న చంద్రబాబు, దగ్గుపాటి కుటుంబాలు ఒకటవుతాయని కిందిస్థాయి కేడర్ అభిప్రాయపడుతున్నారు. అయితే హితేష్ టీడీపీలో చేరి పోటీ చేస్తారా లేదా అన్న విషయం ఇంకా క్లారిటీ లేదు. బీజేపీలో కీలక పదవుల్లో ఉన్నారు పురంధేశ్వరి. మరి బీజేపీని కాదని కొడుకును టీడీపీలో చేరనిస్తుందా అన్న సందేహం కూడా లేకపోలేదు. మరింత క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజుల పాటు ఆగాల్సిందే.

 

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *