మార్స్​ పై దొరికిన ఆ వింత వస్తువు పేరు ఏంటీ?

అంతరిక్షంలో జరిగే ప్రతిదీ వింతగానే ఉంటుంది. దాని గురించి తెలుసుకోవడం అంటే మానవునికి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ క్రమంలోనే మనిషి ఆకాశానికి నిచ్చెన వేశాడు. అంతరిక్షంలోని వెళ్లి అక్కడ ఉన్న రహస్యాలను బయట పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇలా ఇప్పటికే చాలా అంతరిక్ష ప్రయోగాలు చేపట్టాడు. కొన్ని విజయవంతం అయితే మరి కొన్ని ఫెయిల్ అయ్యాయి. ఈ అంతరిక్ష పరిశోధనల్లో కీలక మైనది. మార్స్​ అంతరిక్ష ప్రయోగం. చాలా దేశాలకు మార్స్​ అంతరిక్ష ప్రయోగం ఇప్పటికీ కలగానే ఉంది. అయితే కొన్ని దేశాలు మాత్రం దీనిని అందిపుచ్చుకున్నాయి.

Curiosity rover on Mars is watching the clouds drift by and they're beautiful
Curiosity rover on Mars is watching the clouds drift by and they’re beautiful

ప్రస్తుతం అరుణ గ్రహం మీద పరిశోధన జరుపుతున్న దేశాల్లో అమెరికా ఒకటి. ఈ మార్స్​ పై అమెరికా పంపిన ఓ రోవర్​ అక్కడి వింతలను, విశేషాలను ఎప్పటికప్పుడు సేకరించి వాటిని నాసా శాస్త్రవేత్తలను పంపుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ వస్తువును కనుకొన్నది మార్స్​ రోవర్​. ఈ నెల 13న ఈ వస్తువును మార్స్ రోవర్ కనుగొన్నట్లు పరిశోధకులు తెలిపారు. అయితే ప్రస్తుతం దీనిపై పరిశోధనలు తమ బృందం అధ్యయనం చేస్తుందని శాస్రవేత్తలు పేర్కొన్నారు.

మార్స్​ రోవర్ కనిపెట్టిన ఆ వింత వస్తువు ఏం అయి ఉంటుంది అనే దానిపై పెద్ద చర్చ నడుస్తోంది. మార్స్ రోవర్ పంపిన ఆ వస్తువు ఫోటో ప్రకారం అది ఒక పాత కాలపు వస్తువులాగే కనిపిస్తుంది. కానీ అది నిజంగానే ఓ పాత కాలం వస్తువా? లేక ఏళ్ల కింద ఉన్న శిలలకు సంబంధించి ఆనవాలా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ వస్తువుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *