తన వీరాభిమాని కూతురు పెళ్ళికి సాయం చేసిన చిరంజీవి!
Chiranjeevi : టాలీవుడ్ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 150 సినిమాలకు పైగా నటించి తన ప్రత్యేక హీరోయిజం తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక చిరు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనకు తెలుసు. అలా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్న చిరు.. ప్రస్తుత యంగ్ హీరోలతో పోటీగా దూసుకుపోతున్నాడు
ఇక చిరు సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా రాజకీయంగా కూడా బాధ్యతలు చేపట్టి వదులుకున్నాడు. ఇక చిరు వ్యక్తిగత విషయం లోకి వస్తే సాయం చేయడంలో ఒక అడుగు ముందే ఉంటాడు. ఇదే క్రమంలో తన వీరాభిమాని కూతురు పెళ్లికి సహాయపడ్డాడు చిరంజీవి. రాజం కొండల రావు అనే మెగాస్టార్ వీరాభిమాని.
ఆయన ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ మధ్యకాలంలో కొండల్ రావు కూతురు పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి కొండల రావుకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశాడు. ఈ విషయాన్ని చిరంజీవి అభిమానులు సంఘ అధ్యక్షుడు రవణం స్వామినాయుడు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.
ఈ విషయం తెలిసిన చిరంజీవి అభిమానులు చాలా వరకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి హైదరాబాదులో క్వారంటైన్ లో ఉండడంతో ‘భోళా శంకర్’ చిత్ర షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు మరిన్ని సినిమాల్లో కూడా అవకాశాలు అందుకున్నాడు.