చిరంజీవి గురించి చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్… అలానే ఎదిగారంటూ !

సినీ ఇండస్ట్రీలో హీరో చిరంజీవి స్వశక్తితో ఎదిగారని, అలాంటి వ్యక్తి జగన్ ను ప్రాధేయపడాలా అని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పార్టీ సీనియర్ నేతలతో సోమవారం నిర్వహించిన స్ట్రాటజీ కమిటీలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ స్థాయికి ఎదిగిన తెలుగు సినిమా పరిశ్రమని జగన్‌రెడ్డి కించపరిచారని విమర్శించారు. హైదరాబాద్ పర్యటనలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రపంచంలో మంచి గుర్తింపు ఉందని ప్రధాని మోదీ అన్నారని గుర్తు చేశారు. మోదీ అన్న రెండు రోజుల్లోనే సినీ హీరోలను పిలిచి అవమానించారని సినిమా ఇండస్ట్రీకి లేని సమస్యను సృష్టించి, సినిమా హీరోలను కూడా జగన్ అవమానించారని అన్నారు. టీడీపీ హయాంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి గౌరవం ఇచ్చారో నేతలు గుర్తు చేశారు.

chandra-babu-naidu-sensational-comments-about-mega-star-chiranjeevi

సీఎం జగన్‌రెడ్డి.. హోదాపై మీ యుద్ధం ఎక్కడని ప్రశ్నించారు. పలాయనవాదమెందుకని నిలదీశారు. రాజీనామాలపై నాటి మీ సవాళ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రత్యేకహోదాపై ప్రజలకు జగన్‌రెడ్డి సమాధానం చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. కేంద్రం ఎజెండాలో ప్రత్యేక హోదా తమ ఘనతేనని చెప్పుకున్న వైసీపీ.. ఇప్పుడు తమపై బురద జల్లుతారా? అని ప్రశ్నించారు. ఏపీ ఆదాయం తగ్గకపోయినా ఆర్థికవ్యవస్థను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేదలకు చేరాల్సిన నరేగా పనుల్లో వైసిపి అవినీతిపై టిడిపి పోరాటం చేస్తుందని, విశాఖ ఉక్కుపై ఎందుకు చేతులు కట్టుకుని కూర్చున్నాడో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో విద్యార్థులకు బడులను దూరం చేయడమే “నాడు నేడు” పథకమా? అని నిలదీశారు. రాష్ట్రంలో కరెంట్ సరఫరా లేకుండా పోయిందని, అధిక బిల్లులు మాత్రం వస్తున్నాయని అన్నారు. విద్యుత్ మోటర్లకు మీటర్ల బిగింపును ప్రభుత్వం నిలిపివేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *