గుడ్లు తింటే మధుమేహం సమస్య వస్తుందా?

Egg: ప్రస్తుత మానవ శైలిలో గుడ్లను అనేక రకాలుగా డైట్ లో వాడుతున్నారు. వ్యాయామాలు చేసే వాళ్ళు గుడ్లను విరివిగా తినడం మొదలు పెట్టారు. ఈ గుడ్లను ఉడికించడం సులువైన పద్ధతి కాబట్టి వీటిని చిన్నా పెద్దా అని తేడా లేకుండా విరివిగా తినేస్తున్నారు. అయితే ఇలా తినడం మధుమేహం ఉన్న వారికి ప్రమాదం అని తెలుస్తుంది. ఇప్పుడు వాటి గురించి వివరాలు తెలుసుకుందాం.

గుడ్డు వినియోగం విరివిగా పెరుగుతుంది. 2009లో చైనా ప్రకారం గుడ్లు తినే వారి సంఖ్య చాలా వరకు పెరిగింది. ఎక్కువ కాలం గుడ్డు తినడం వల్ల చైనీస్ పెద్దలలో 25 శాతం మధుమేహం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే క్రమం తప్పకుండా చాలావరకు గుడ్లు తినే పెద్దలలో మధుమేహం 60 శాతం పెరిగిన అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ అతి భయంకరమైన మధుమేహ వ్యాధిని మీరు త్వరగా అరికట్టాలి అంటే మీ ఆరోగ్యమైన ఆహారపు అలవాట్లు పెంచుకోవాలి. అంతే కాకుండా ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. ఇలా వ్యాయామం చేస్తూ డైలీ ఒక గుడ్డు తినవచ్చు. ఇలా చేయడం వల్ల గుడ్డు మధుమేహ వ్యాప్తికి ఏమాత్రం సహాయం చేయదు.

అంతే కాకుండా మీరు రోజు గుడ్డు తినే క్రమంలో దానికి సరిపడే ఆహార పదార్ధాల షెడ్యూల్ ను ఎంచుకోండి. రక్తపోటు తో ఎక్కువగా బాధపడేవారు వైద్యుల సలహా పొందడం తప్పనిసరి. ఇదే క్రమంలో మీరు రక్తంలో చక్కెర స్థాయిని డాక్టర్ దగ్గర ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం మంచిది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *