ఏపీ సీఎం మళ్లీ జగనే.. తేల్చేసి చెప్పిన సీ ఓటర్ సర్వే!
ఆంధ్ర ప్రదేశ్ లో క్రమంగా పాదయాత్ర చేసి.. రైతూ, కూలీల బాగోగులు తెలుసుకొని ‘నెవెర్ గివ్ అప్’ గా పోరాడుతూ ఏపీ ప్రజలకు నవరత్నాల వలవేసి ఎట్టకేలకు 2018 ఎన్నికల్లో గెలిచాడు వై యస్ జగన్ మోహన్ రెడ్డి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం నవరత్నాల పై చేసి ఏపీ ప్రజలకు ఎంతో సంతృప్తిని కలిగించాడు.
ఇదిలా ఉంటే జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి దాదాపు మూడు సంవత్సరాలు అయిపోవచ్చింది. ఈ క్రమంలో ప్రముఖ సర్వే సంస్థ ‘సీ ఓటర్-ఇండియా టుడే’ సంస్థ చేసిన సర్వే లో మరోసారి 2024 సీఎం జగనే అని తేలింది. ఈ సర్వే దేశవ్యాప్తంగా ప్రజలలో ఆసక్తిని రేపింది.
ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు ప్రారంభిస్తే కేంద్రంలో మరోసారి బిజేపి అధికారంలోకి వచ్చి మోదీ ప్రధాని కావడం పక్కా అని తెల్చేసి చెప్పింది. ఇక ఏపీ విషయానికొస్తే మళ్లీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చి సీఎం కుర్చీలో కూర్చుంటాడని ఖాయం చేసి చెప్పింది. దేశవ్యాప్తంగా బీజేపీ కి, రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కి ఓటింగ్ విషయంలో ఎటువంటి డోకా లేదని వెల్లడించింది.
ఇక ఎన్డీఏకు 350 నుంచి 296కు సీట్లు తగ్గవచ్చని బిజెపి ఎంపీల విషయానికి వస్తే 303నుంచి 271కి తగ్గిపోతాయని అయినప్పటికీ దేశంలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని సీ ఓటర్ సర్వే తెల్చేసి చెప్పింది.