నానికి సారీ చెప్పిన బన్నీ.. ఎందుకో తెలుసా?
Allu Arjun And Nani: టాలీవుడ్ ఇండస్ట్రీకి నాచురల్ స్టార్ నాని గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అష్టా చమ్మా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ నాని. ఆపై పలు సినిమాలతో తన సక్సెస్ యారోతో ఓ రేంజ్ లో దూసుకు వెళుతున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోలలో తాను ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ మధ్య ‘టక్ జగదీష్ ‘ చిత్రం ఓటిటి పాలు అయినప్పటికీ..
ఇటీవల వెంకట్ బోయినపల్లి నిర్మాణంలో వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటూ థియేటర్ లలో తెగ హడావిడి చేస్తుంది. సినిమాలో నాని సరసన సాయి పల్లవి మరింత మెప్పించిన సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నానికి సారీ చెప్పినట్లు తెలిసింది. ఎందుకంటే.. తాజాగా అల్లు అర్జున్ శ్యామ్ సింగరాయ్ సినిమా చూశాడు.
ఆ సినిమా అతనికి నచ్చడంతో ఈ సినిమా బృందానికి అభినందనలు తెలపటం మర్చిపోయాడు. ఈ క్రమంలో ‘రౌడీ బాయ్స్’ సినిమాలో ఒక సాంగ్ రిలీజ్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన బన్నీ.. శ్యామ్ సింగరాయ్ టీమ్ కు అభినందనలు తెలపడం నేను మర్చిపోయానని మాట్లాడుతూ.. నానికి, నాని బృందానికి అభినందనలు తెలియజేశాడు బన్నీ. ఇక ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’ ను ప్రత్యేకంగా కలిసిన రామ్ చరణ్ కూడా అభినందనలు తెలియజేశాడు. ఇప్పుడు బన్నీ కూడా అభినందనలు తెలియజేశాడు. అంతకంటే ముందు క్షమాపణలు కూడా అడిగాడు బన్నీ.