అమ్మకు ముద్దు పెడతాడనుకుంటే.. అమ్మాయికి పెట్టాడు…!
చిన్న పిల్లలు చేసే చాలా పనులు గమ్మత్తుగా ఉంటాయి. చూసేందుకు చాలా క్యూట్ గా కూడా ఉంటాయి. వారు చేసేవి అలానే చూస్తు ఉండాలని ఎవరికి అయినా అనిపిస్తుంది. వారు చేసే పనులు మనకు విసుగు అని కూడా అనిపించవు. తెలిసి తెలియని చిన్న వయసులో వారు చేసే ప్రతీ పని చాలా ముచ్చటగా ఉంటుంది. అయితే చిన్న పిల్లలు స్కూలుకు వెళ్లేటప్పుడు చాలామంది గోల చేస్తారు. నేను బడికి పోను అని మారం చేస్తారు. అప్పటి వరకు ఇంట్లోనే ఉండి… బడికి వెళ్లాలి అంటే చాలా కష్టపడుతారు. అందుకే స్కూల్ కు పంపించే సమయంలో పిల్లలు గోల చేయకుండా ఉండేందుకు అమ్మ కానీ నాన్నకానీ వారికి ముద్దులు పెట్టి మంచి మాటలు చెప్పి పంపుతారు.
పిల్లలను స్కూల్ దగ్గర డ్రాప్ చేసిన తరువాత లోపలికి వెళ్తేటప్పుడు కచ్చితంగా వారికి ముద్దు పెట్టి పంపిస్తారు. అయితే ఇలానే ఓ పిల్లాడు చేసిన పని ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ తల్లి తన కుమారుడ్ని స్కూల్ లో వదిలి పెడుతుంది. ఆ సమయంలో ఎప్పటిలాగానే కొడుకును ముద్దు పెట్టిమని చెప్తుంది. అప్పటి వరుకు బాగానే ఉన్న కానీ… ముద్దు పెట్టు అని అమ్మ అడగగానే ఆ బాలుడు పక్కన వచ్చే అమ్మాయికి ఓ లిప్ కిస్ ఇస్తాడు.
ఇలా బాలుడు స్కూల్ కు పోతా చిన్నారికి ముద్దు పెట్టేది ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే మద్దు పెట్టు అని చెప్పగానే తనకు ముద్దు పెడతాడని అనుకుంటే.. ఇలా పక్కన అమ్మాయికి పెట్టడం ఏంటి అని తల్లి ముందు షాక్ అయ్యింది. దీనిని చూసిన చాలా మంది బుడ్డోడు మంచి రొమాంటిక్ ఫెలోలా ఉన్నాడని కామెంట్లు చేస్తున్నారు.